ఆనంద్ దేవరకొండ తన కెరీర్ లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ గం గం గణేశా. తాజాగా ఆ చిత్ర బృందం అదిరిపోయే అప్డేట్ను ఇచ్చింది. ఈ సినిమాను మే 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది. హై-లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్న గం గం గణేశాకి ఉదయ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంద్ దేవరకొండ సరసన ప్రగతి శ్రీవాత్సవ హీరోయిన్ గా నటిస్తుంది.
బేబీలాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత ఆనంద్ దేవరకొండ నటిస్తున్న చిత్రం కావడం దాంతోపాటు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. కొండ అంచున నిలబడి ఉన్న ఆనంద్ దేవరకొండ గన్ ఫైర్ చేసినప్పుడు ఆ గన్ నుంచి గులాబి రేకలు వస్తున్నట్లు చేసిన డిజైన్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
కాగా విజయ్ దేవరకొండ తమ్ముడిగా దొరసాని సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినా మిడిల్ క్లాస్ మెలోడీస్, బేబీ వంటి చిత్రాలతో తనను తాను నిరూపించుకున్నాడు ఆనంద్ దేవరకొండ. ఆయన తొలిసారిగా నటిస్తున్న క్రైమ్, యాక్షన్ కామెడీ డ్రామా కావడంతో గం గం గణేశాపై సినీ ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి.