శివ తుర్లపాటి దర్శకత్వంలో అంజలి ప్రధాన పాత్రలో నటించిన గీతాంజలి చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన గీతాంజలి మళ్ళీ వచ్చింది ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. కోన వెంకట్, ఎంవివి సత్యన్నారాయణ నిర్మించిన ఈ చిత్రంలో అంజలితో పాటు శ్రీనివాస రెడ్డి, సునీల్, సత్యం రాజేష్, సత్య ప్రధాన పాత్రలు పోషించారు. కానీ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైన ఈ చిత్రం ఓటిటిలో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది..
అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం మే 10 నుండి ఓటీటీలోకి అందుబాటులో రానుందని తెలుస్తుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా మే 10 నుండి స్ట్రీమింగ్ కానుందని తెలుస్తుంది. థియేటర్లలో అంతగా అకట్టుకోని ఈ చిత్రం ఓటిటిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ ఆశాభావంతో ఉన్నారు.. కాగా ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది..