తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి కుమారుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు జనంలోకి వచ్చే ధైర్యం లేదు. కానీ ట్విట్టర్ (ఎక్స్)లో మాత్రం పెద్ద పెద్ద పదాలు వాడతారు. తెలుగు తమ్ముళ్లేమో వాటికి సింహం గర్జించిందింది అంటూ కామెంట్లు పెడుతుంటారు. సభల్లో స్పష్టంగా మాట్లాడలేని వ్యక్తి సోషల్ మీడియాలో మాత్రం సవాళ్లు చేస్తుంటారు. అచ్చ తెలుగులో ఆయన ఒక్క పోస్టు కూడా పెట్టలేరనుకోండి.
సీ ఓటర్స్ సర్వేకు విశ్వసనీయత లేదని ఎప్పుడో తేలిపోయింది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో వారి అంచనాలు తలకిందులయ్యాయి. 2019లోనూ దాని లెక్కలు తప్పాయి. దీంతో జనం పట్టించుకోవడం లేదు. చంద్రబాబు ఢిల్లీ నుంచి వచ్చాక సీ ఓటర్ల సర్వే అంటూ తెలుగుదేశం, జనసేన, ఎల్లో మీడియా హంగామా చేస్తున్నాయి. వాళ్లకు 17 ఎంపీ సీట్లు వస్తాయంట. వైఎస్సార్ కాంగ్రెస్‌కు 8 స్థానాలంట. దీనికే ట్విట్టర్లో రాతలు రాయించి లోకేశ్ మురిసిపోతున్నారు. వైఎస్సార్సీపీకి అంతిమయాత్ర పక్కా అంటూ తనకు నోరు తిరగని పదాలను టీమ్ చేత పోస్ట్ చేయించారు. వాస్తవానికి ఏడెనిమిది పెద్ద సంస్థలు సర్వే చేసి ఈసారి కూడా జగన్ గెలుస్తున్నాడని స్పష్టం చేశాయి. దీనిని తట్టుకోలేకపోయిన తెలుగుదేశం వెంటనే గాలి లెక్కలతో సీ ఓటర్ల సర్వేను విడుదల చేయించి జబ్బలు చరుచుకుంటోంది. అసలు గెలిచే అవకాశం ఉంటే టికెట్లు ప్రకటించేందుకు ఇంకా సమయం ఎందుకు తీసుకుంటున్నట్లు?, లోకేశ్‌ను జనంలోకి రానివ్వకుండా ఇన్ని రోజులు ఎందుకు అడ్డుకున్నట్లు?, పవన్‌ను ఎందుకు మచ్చిక చేసుకున్నట్లు?, బీజేపీ ఒడిలో వాలేందుకు ఎందుకు తిరుగుతున్నట్లు?, ఇవన్నీ సమాధానాలు దొరకని ప్రశ్నలు.
సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే ఉరి వేసుకున్నట్లేనని చెప్పిన ఘనుడు లోకేశ్. ఇప్పుడు ఆయన మేం వచ్చేస్తున్నామంటూ చేస్తున్న హడావుడిని చూసి జనం నవ్వుకుంటున్నారు. 19 ఎన్నికల సమయంలో ఒకటో క్లాసో.. లేక రెండో క్లాసు పిల్లాడు సర్వే చేసి టీడీపీ వస్తుందని తేల్చాడని ఆంధ్రజ్యోతి ప్రముఖంగా వార్త ప్రచురించింది. ఈసారి కూడా అలాంటివి వస్తాయేమో.. వాటిపై సోషల్ మీడియాలో లోకేశ్ పోస్టులు వేయించి మురిసిపోయినా ఆశ్చర్యం లేదు. జనంలో లేని వాళ్లంతా ఇలానే చేస్తుంటారు. అదే సమయంలో సంక్షేమ పథకాల రారాజు మాత్రం నవ్వుతూ ఎన్నికలను గెలిచేస్తాడు.