2024 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన అధికారులు, సిబ్బందికి పలు రకాల శిక్షణ కార్యక్రమాలు ఇస్తున్నారు. వీటిని ఈ నెల చివరకు పూర్తి చేయాలని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా శనివారం తన కార్యాలయంలో జిల్లా స్థాయి ఎన్నికల అధికారులుతో వీడియో కాన్ఫరెన్స్ లో తెలిపారు.
కాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన వెంటనే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని, ఓటర్లు నమోదులో, ఓటర్ల ముసాయిదాలో ఎలాంటి అవకతవకలు ఉండకూడదని అధికారులుకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే శిక్షణ పొందుతున్న ఫ్లైయింగ్ స్క్వాడ్ లు, సర్వేలైన్స్ టీములు, వీడియో వ్యూయింగ్ టీంలు ఈ నెలాఖరులోగా శిక్షణ పూర్తి చేసుకొని త్వరితగతిన కార్యాలయాలు వెంటనే ఏర్పాటు చేసి ప్రారంభించాలని స్పష్టం చేశారు.
ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణను మార్చి నెలలో ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికే రిటర్నిగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు నియమించడం జరగడంతో ఇంకా రిపోర్ట్ చేయని వాళ్ళ వివరాలు తెలుసుకొని రిపోర్ట్ చేయకపోతే కొత్త వారిని నియమించాలని, ఈ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, పోలింగ్ కేంద్రాలు వద్ద కల్పించాల్సిన సౌకర్యాలు, వయో వృద్ధలుకు, విభిన్న ప్రతిభావంతులుకు ఇంటి దగ్గర వోట్ వేసే వేసేల చర్యలు తీసుకొని అధికారులను ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు.