గతంలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి అన్న ఆర్నెల్ల ముందే కులానికో డజను హామీల చొప్పున మేనిఫెస్టో సిద్ధం చేసి జనాల్లో విపరీతమైన పబ్లిసిటీ చేసుకునే టీడీపీ ఈ ఎన్నికలకు మాత్రం ఇంకా మేనిఫెస్టో తయారు కూడా చేసుకున్నట్లు లేదు..
2023 మే 28 న మినీ మేనిఫెస్టో అని సూపర్ సిక్స్ అని ఆరు హామీలతో ప్రకటన చేసి పూర్తి స్థాయి మేనిఫెస్టో దసరాకి విడుదల చేస్తాం అన్నారు. దసరా సమయం లో బాబు జైల్లో ఉండగా మేనిఫెస్టో విడుదల చేయలేకపోయారు, త్వరలో జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించారు.. నేడో రేపో ఎన్నికల కోడ్ వచ్చేలా ఉన్నా ఇప్పటికీ మేనిఫెస్టో ఊసే లేదు..
మరోవైపు ఇంతవరకు పొత్తు ఖరారు కాలేదు, సీట్ల సర్దుబాటు కాలేదు.. పట్టుమని పది స్థానాల్లో ఎవరు పోటీ చేయబోతున్నారో కూడా స్పష్టత లేదు. బీజేపీ తో పొత్తు ఉంటుందా లేదా? బీజేపీ ఎన్ని స్థానాలు కోరుతుందో వారికి ఎన్ని స్థానాలు కేటాయించాలో కూడా అర్థం అవ్వక తర్జన భర్జన పడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఒక పక్క పొత్తు పై స్పష్టత లేక, మరో వైపు నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేస్తున్నారో తెలియక, ఇంకోపక్క మేనిఫెస్టో ఊసే లేక టీడీపీ క్యాడర్ లో నిస్సత్తువ ఆవరించింది. ఎన్నికల నాటికి పోటీ చేయకుండానే పూర్తిగా చేతులెత్తేసే పరిస్థితి టీడీపీలో నెలకొంది…
పార్టీ పెట్టిన నాటి నుండి టీడీపీ ఇంత అద్వాన్న పరిస్థితుల్లో ఎన్నడూ లేదని, తమ భవిష్యత్తు పై నీలి నీడలు కమ్ముకునేలా ఉన్నాయని టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు… వేచి చూద్దాం ఎన్నికల కోడ్ వచ్చాక అయినా పొత్తు ఖరారు అయ్యి, సీట్ల సర్దుబాటు జరిగి అసంతృప్తుల బిజ్జగింపు జరిగి, పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల అవుతుందేమో…. కనీస స్థాయి పోటీ అయినా ఇస్తుందేమో….