విక్రమార్కుడు సినిమాలో రవితేజ, బ్రహ్మానందం దొంగతనాలు చేస్తుంటారు. జనాన్ని మోసం చేసి గుండ్లు కొట్టగా వచ్చిన 20 వేల రూపాయలకు పైగా నగదు పంచుకునేందుకు కూర్చొంటారు. ఆ సమయంలో కొంత డబ్బు పక్కన పెట్టి రౌండ్ ఫిగర్ అంటూ ఒక లాజిక్ చెప్పి రవితేజ.. బ్రహ్మిని మోసగిస్తాడు. ఇద్దరం కలిసి కష్టపడ్డాం కాబట్టి పది వేలు.. పది వేలు నాకని అంటాడు. వెంటనే బ్రహ్మికి ఇచ్చిన ఆ పదివేలు తీసుకుని సగం గుండ్లు నేను కొడితే.. మిగతా సగం నువ్వు కొట్టావు కాబట్టి ఆ మొత్తంలో ఫిఫ్టీ ఫిఫ్టీ అంటాడు. దీంతో బ్రహ్మి నువ్వు ఎప్పుడూ సరిగ్గా పంచవని ఏడుస్తాడు. మోసం చేసేవాడెవడూ బాగుపడడు అంటాడు. దీనికి రవితేజ మనం చేసేది గుడిలో పూజ మరి అని సెటైర్ వేసి నీకు వద్దకపోతే ఆ డబ్బులు కూడా ఇచ్చేయ్ అంటాడు. బ్రహ్మి ఇవ్వడు. ఇద్దరూ నగదు విషయంలో తిట్టుకున్నా మళ్లీ దొంగతనాలకు వెళ్తారు.
ఇప్పుడు అదే సీన్‌ను తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సీట్ల విషయంలో అన్వయిద్దాం. మొత్తం 175.. పెట్టుబడి పెట్టేది నేనే కాబట్టి ఫస్ట్ లిస్ట్‌లో మా వాళ్లు 94 మంది ఉంటారు. నేను జైల్లో ఉన్నప్పుడు నీకు నువ్వుగా వచ్చి పొత్తు ప్రకటించావు కాబట్టి 24 అసెంబ్లీ, మూడు ఎంపీ సీట్లు ఇస్తున్నా. పెద్ద మనిషిని నేనే కాబట్టి సీఎం అభ్యర్థిగా ఉంటా. క్లియర్ కదా.. అని బాబు అంటాడు. దీనికి పవన్.. బ్రహ్మానందం లాగే నువ్వు ఎప్పుడూ మోసం చేస్తావు. మా వాళ్లు సీఎం సీటు అడుగు అంటున్నా నీకు ఇచ్చేస్తే.. టికెట్లు చాలా తక్కువ ఇచ్చావని ఏడుస్తాడు. దీనికి బాబు పిచ్చోడా నీకు తక్కువ సీట్లు ఇవ్వలేదు. మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు 18 నుంచి 20 శాసనసభ స్థానాలతో సమానం. సో మొత్తం నీకు దక్కింది 40 పైనే అంటాడు. పవన్ సంబరపడిపోయి నారా వారు దాచేసిన 57 సీట్లు గురించి మరిపోయాడు. 40 అంకె వినగానే.. అది అలా చెప్పు.. నేను మోసపోయే రకం కాదంటాడు. ఇంతలో బాబు నీ 24లో ఐదు మాత్రమే మీడియా ముందు వెల్లడించు. మనిద్దరం ఫ్రెండ్స్ కాబట్టి మిగిలిన వాటిలో నేను కొన్ని తీసుకుంటానని చెప్పాడు. మళ్లీ సేనాని ఏడుపందుకోగా.. సముదాయించడానికి ఆ సీట్లు నేరుగా తీసుకోను. మా వాళ్లని నీ పార్టీలోకి పంపి బీఫారాలు ఇప్పిస్తా అంటాడు బాబు. అధికారం చేతికొస్తే ప్రజా చేస్తామా ఏంది.. నేను దోచుకునే దాంట్లో నీకు పావలా భాగం ఇస్తా కదా.. ఇక టికెట్లతో నీకేం అనగానే పవన్ అలా అయితే ఓకే.. మొత్తం నువ్వే తీసేసుకున్నా అభ్యంతరం లేదని ఇద్దరూ ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకుని వెళ్లిపోతారు.
పొత్తులో భాగంగా చంద్రబాబు, పవన్ కలిసి శనివారం సీట్లు ప్రకటించారు. ఇందులో అతిపెద్ద మోసం దాగుంది. సేనానికి తెలిసి జరిగిందో.. లేక బాబు నక్క తెలివి చూపించాడో గానీ మొత్తానికి జనసేనకు చాలా తక్కువ స్థానాలు దక్కాయి. అందులోనూ మిగిలిన 19 చోట్ల సేన నేతలు పోటీ చేసేది అనుమానమే.
బాబు తొలివిడతలో తన కోటా కింద 94 సీట్లలో అభ్యర్థులను ప్రకటించేశాడు. 57 స్థానాలను వివిధ కారణాలతో ఆపి పెట్టాడు. సేనకు మొత్తంగా 24 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలు ఇచ్చాడు. అసలే తక్కువ ఇచ్చారని జనసైనికులు ఏడుస్తున్నారు. ఆ 94లో కొన్నింటిని సేన నేతలు ఆశించారు. వారి నోట్లో మట్టికొట్టారు. ఇక బాబు తనకోసం, బీజేపీ కోసం దాచి పెట్టుకున్న 57 స్థానాలతో సంబంధం లేకుండా సేనాని ఆపిన 19 స్థానాలపై కన్నేశాడు. ఇది బహిరంగ రహస్యం.
పవన్ అట్టిపెట్టుకున్న సీటు ఏవో చెప్పలేదు. చంద్రబాబు తమవారు కోరుకున్న విధంగా సీట్లు ఇచ్చి సేనానికి 19 సీట్లు ఎక్కడైనా ఇచ్చే అవకాశముంది. మరొకటి ఏంటంటే త్యాగాల పేరుతో తమ నేతల్ని బాబు ఆపుతున్నారు కానీ.. నిజం ఏంటంటే సేన అభ్యర్థులైతే ఓడిపోతారని చెప్పి టీడీపీ ముఖ్య నేతల్నే ఆ పార్టీలోకి పంపి పనవ్ చేతే బీఫారాలు ఇప్పించే స్కెచ్‌ను నారా వారు వేసినట్లు ప్రచారం ఉంది. ఈ కారణంగా ఆ 19లో సేనకు దక్కేది చాలా తక్కువ మాత్రమే.
ఇకపోతే పవన్ గతంలో కొన్ని సీట్లలో తమ అభ్యర్థులుంటారని చెప్పారు. వాటిలో పెందుర్తి, గాజువాక, విశాఖ దక్షిణం, అనకాపల్లి, యలమంచి ఉన్నాయి. కానీ అనకాపల్లి సీటును మాత్రమే కొణతాల రామకృష్ణకు ప్రకటించారు. మిగతా చోట్ల ఎవరు అభ్యర్థులు తేల్చలేదు. దీనిని బట్టి ఇవి బాబు ఖాతాలోనే ఉండే అవకాశముంది. సేనానికి కావాల్సింది 19 సీట్లు. అవి ఎక్కడైనా ఇవ్వొచ్చనేది తెలుగుదేశం అధిష్టానం భావన. ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీ ఇంకా కూటమిలో చేరలేదు. ఒకవేళ వారొస్తే సీట్లు ఇవ్వాలి. మొత్తంగా ఆగిన 76 సీట్లలో ఎక్కడైన వారు తీసుకోవచ్చు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు కదా.. బాబు, పవన్ నో చెప్పరు.
పెద్ద నాటకం
టికెట్ల విషయంలో చంద్రబాబు నాటకమాడుతున్నారు. చాలావరకు తాము నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. సేన 19, టీడీపీ 57 సీట్లలో అభ్యర్థులెవరో అర్థం గాక అశావహులంతా ఎదురు చూడాల్సిందే. బీజేపీ నుంచి గ్రీన్‌సిగ్నల్ రావాలి. వారు ఏ స్థానాలు అడుగుతారో చూడాలి. అప్పుడు కొంత క్లారిటీ వస్తుంది. అప్పటి వరకూ ఎవరూ గొడవ చేయకుండా పోటీ చేసేది మీరే మీరే అంటూ ఊరిస్తూ నాటకాన్ని బాగా రక్తి కట్టేంచే ప్లాన్ ఇది.