ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఎక్కడా చూడని విచిత్ర రాజకీయాలకి వేదికగా మారుతోంది. 175 స్థానాలు గెలుపే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ దూసుకుపోతుంటే. ప్రతిపక్షాలు మాత్రం పొత్తులు పెట్టుకుని అంతర్గత కుమ్ములాటలతో వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్నా కింద స్థాయి కార్యకర్తలు మాత్రం కలవలేక నిత్యం కుమ్ములాడుకోవడం కనిపిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు అది కార్యకర్తల స్థాయి నుండి అధినేతల స్థాయికి చేరింది.
ఈ గందరగోళానికి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తెరలేపినట్టు కనిపిస్తుంది. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ప్రసంగిస్తూ చంద్రబాబు పొత్తు ధర్మం పాటించడంలేదని దానికి నేను కార్యకర్తలకి క్షమాపణ చెబుతున్నామని. లోకేష్ మా నాన్న చంద్రబాబే సీఎం అన్నా మౌనంగా ఉన్నామని. ఒంటరిగా పోటీ చేస్తే సీట్లు వస్తాయి కానీ జగన్ ప్రభుత్వాన్ని దించలేమని అందుకే తాను తగ్గి ఉంటునట్టు చెప్పుకున్నారు.
అలాగే అరకు నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జిగా రాకదిలిరా సభలో సియ్యారి దొన్నుదొర పేరును చంద్రబాబు ప్రకటించారని. కోనసీమ జిల్లా మండపేట వేదికగా జరిగిన రా.. కదలిరా సభలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మండపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును ప్రకటించారని. ఇవన్నీ పొత్తు ధర్మం పాటించకుండా ఒత్తిడికి లోనై ప్రకటించి ఉంటారని అందుకే తనకి ఒత్తిడి ఉన్న సంధర్భంగా తాను కూడా రెండు సీట్లు జనసేన ప్రకటిస్తుందని రాజానగరం , రాజోలు సీట్లలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు.
గతంలో ఎప్పుడు ఎక్కడా రాజకీయాల్లో చూడని విధంగా జగన్ పై ద్వేషంతో కలిసి ఉన్నట్టు క్యాడర్ ని నమ్మిస్తూ లోలోపల కుమ్ములాడుకుంటూ పొత్తులో కొనసాగుతున్న చంద్రబాబు పవన్ ఒక చెడు మార్గాన్ని పరిచయం చేస్తునట్టు కనిపిస్తుంది. ప్రజల శ్రేయస్సు కాకుండా సొంత ద్వేషాలతో పొత్తులు కుదుర్చుకుని అవగాహనా రాహిత్యంగా సీట్లు ప్రకటించుకుంటూ పోతే ఆయా పార్టీ కార్యకర్తలకి సంభరంగానే ఉండచ్చు కానీ ప్రజలకి మాత్రం ఏవగింపు కలుగుతున్న విషయం పవన్ బాబు గ్రహిస్తారో లేదో.