2024 సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో బిజెపి పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. ఎన్డీఏ కూటమిలో పొత్తులో ఉన్న టిడిపి జనసేనలో తరఫున ప్రచారం చేయనున్నారని సమాచారం. మొదట ఈ పర్యటన మే 3,4 తేదీలలో ఉన్నట్లు ప్రకటన విడుదల చేశారు. కానీ మోదీ బిజీ షెడ్యూల్ కారణం చేత మే 7, 8 తేదీలకు మారుస్తున్నట్లు బిజెపి కేంద్ర అధిష్టానం ప్రకటన విడుదల చేసింది.మే 7న పీలేరు, విజయవాడలో మోడీ పర్యటన ఉంటుంది. మే 8న రాజమండ్రి, అనకాపల్లిలో ప్రచారం చేయనున్నారు. మే 1,2 తేదీలలో తెలంగాణ పర్యటనలో మోదీ ఉన్నప్పటికీ దాని తర్వాత ఆంధ్రాలో ఉంటుందని భావించారు.
కానీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి విరామం లేకుండా నరేంద్ర మోడీ వరస సభలు రోడ్ షో లలో పాల్గొంటున్న నేపథ్యంలో విశ్రాంతి కోసం ముందునుకున్న తేదీలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. కూటమి పొత్తు ఖరారై ఇప్పటికే 45 రోజులు కావస్తున్నా ఇప్పటివరకు ఒక సభ మాత్రమే జరిగింది, ఈ సమయానికి నాలుగు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని తెలిపిన అవి సాధ్యం కాలేదు, చివరికి ఇప్పుడు ప్రకటించిన తేదీలలో అయినా మోదీ ఆంధ్రాకి వస్తారా అని ప్రశ్న చాలామందిలో ఉత్పన్నం అవుతోంది.
మే 7 మధ్యానం 2 గంటల 45 నిమిషాలకు జరగబోయే ఎన్నికల ప్రచారంలో రాజంపేట పార్లమెంట్ తరఫున పోటీ చేస్తున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తరఫున ప్రచార సభలో పాల్గొంటారు. మే 7 సాయంత్రం విజయవాడలో రోడ్ షోలో పాల్గొంటారు. మే 8 మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు రాజమండ్రి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న పురందేశ్వరి తరపున రాజమండ్రి ప్రచార సభలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు, బిజెపి తరఫున అనకాపల్లిలో పోటీ చేస్తున్న సీఎం రమేష్ తరపున మోడీ ప్రచార సభలో పాల్గొంటారని బిజెపి పార్టీ వర్గాలు తెలిపాయి.