కొలికపూడి శ్రీనివాస రావు – గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ పేరిట టీవీ డిబేట్లలో పాల్గొని చంద్రబాబుని, రాజధాని అమరావతిని పలుమార్లు తీవ్రంగా విమర్శించిన వ్యక్తి . అయినా కానీ వైసీపీ పార్టీలో తగిన గుర్తింపు కానీ, ఆహ్వానం కానీ రాలేదు అని టీడీపీ ద్వారా మరింత రాజకీయ భవిష్యత్తు ఉండొచ్చు అనుకొన్నాడో ఏమో కానీ 2019 చివర్లో టీడీపీ అమరావతి ఉద్యమం మొదలెట్టగానే అందులో దూరి పోయాడు.
ఆ తర్వాత అతని ప్రస్థానం సోషల్ మీడియా అప్డేట్స్ ఫాలో అయ్యేవారికి తెలిసిందే . అమరావతి ఉద్యమం పేరిట జాయింట్ కమిటీలు, సమితులు, సంఘాలు అంటూ ఒ పది పేర్లు పెట్టి వాటికి అధ్యక్షుడిగా ప్రకటించుకొన్నాడు. అటు పై టీడీపీ ప్రేరేపిత ఉద్యమకారులతో సన్నిహితంగా తిరుగుతూ
వైసిపిణీ తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ, మొదట ఎల్లో మీడియా దృష్టిని, తర్వాత చంద్రబాబు దృష్టిని తన వైపు తిప్పుకొన్నాడు. ఈ క్రమంలో అతని వ్యాఖ్యలు, చర్యలు సభ్య సమాజానికి ఏహ్యం కలిగించినా కానీ ఎల్లో మీడియాకి, టీడీపీకి అవే ముద్దు అనిపించాయి.
ఈ క్రమంలో ఒ టీవీ డిబేట్ లో బిజెపి నేత విష్ణు వర్ధన్ ని బహిరంగంగా చెప్పుతో కొట్టి సభ్య సమాజం నివ్వెర పోయేట్టు చేశాడు. ఈ ఘటన పై టీడీపీ సంతాపం వ్యక్తం చేయటం కానీ కొలికపూడి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం కానీ చేయకపోగా మరింత ప్రోత్సాహించిందని చెప్పొచ్చు. ఆ ఉత్సాహంతో ఇటీవల సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తల నరికి తెచ్చి తనకి ఇస్తే కోటి రూపాయలు ఇస్తానని బహిరంగంగా సుఫారీ ఆఫర్ చేశాడు.
ఇలా తీవ్ర వ్యాఖ్యలు, దుందుడుకు చర్యలు, భౌతిక దాడులు తన అర్హతగా భావిస్తూ తాడికొండ సీటు ఆశిస్తూ వచ్చాడు . గత కొంతకాలంగా తనకి తాడికొండ సీటు ఇవ్వాలని కోరుతూ వస్తున్నాడు. గత కొంతకాలంగా చంద్రబాబు కూడా అభ్యంతరకర భాషని, భౌతిక దాడుల్ని ప్రోత్సాహిస్తూ వస్తున్న నేపథ్యంలో అతని అసభ్య పదజాలం, బిజెపి నేతని చెప్పుతో కొట్టటం, rgv తల నరకమని సుఫారీ ప్రకటించడం బాబుకి నచ్చినట్లు ఉన్నాయి. అందుకే అతనికి సీటు కట్టబెట్టినట్టున్నారు.
టికెట్ అయితే దక్కింది కానీ పోటీ చేసే ఆర్ధిక స్థోమత ఉందా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు . ఎందుకంటే రెండేళ్ల క్రితం అమరావతి ఉద్యమ మహిళల్ని డబ్బుల కోసం వేదిస్తున్నాడు అని ఆరోపణలు ఎదుర్కొని సోషల్ మీడియా వేదికగా పెద్ద రగడ జరిగింది. టీడీపీ మహిళల్ని అయిదు, పది వేల డబ్బుల కోసం వేదించటం మానుకోమని కొందరు టీడీపీ కార్యకర్తలు మాట్లాడిన కాల్ రికార్డ్స్ కూడా బయటకి వచ్చాయి. అలాంటి వ్యక్తి రెండేళ్లలో ఒక సినీ దర్శకుడి తల నరికితే కోటి రూపాయలు ఇస్తా అన్నాడంటే అతని వద్ద ఎంత మొత్తం డబ్బులు ఉండి ఉండొచ్చో మీరు ఊహించండి.
అంతా అమరావతి ఉద్యమం పేరిట జరిగిన చందాల దందా మహత్యం, బాబు ఉద్యమంలో చేరి బాబుకి నామాలు పెట్టి బాబు చందాలు కొట్టేసి చివరికి బాబు దగ్గరే ఎమ్మెల్యే సీటు కొట్టేసాడంటే మామూలోడు కాదు కొలికపూడి అని అమరావతి ఉద్యమ చందాల దందాలో భాగస్వామ్యం దక్కని వారు అసూయ పడుతున్నారట