ఈయన అమరావతి రైతుల తరపున ఉద్యమ నాయకుడిగా వెలుగులోకి వచ్చాడు. APJAC (ఆంధ్రప్రదేశ్ జాయిన్ యాక్షన్ కమిటీ) సభ్యుడుగా ఉన్న కొలికపూడి మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అని బాగా పోరాటం చేశాడు. ఈయన బాగా పాపులర్ అయ్యింది మాత్రం బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మీద ఒక టీవీ డిబేట్ లో చెప్పుతో దాడి చెయ్యడం తరవాత అని చెప్పుకోవచ్చు.
ఈయన తర్వాత టీడీపీ తరపున టీవీ డిబేట్లలో పాల్గొంటూ ఆ పార్టీ మిద ఈగ కూడా వాలనివ్వకుండా చూసుకుంటాడు. సోషల్ మీడియాలో కూడా ఆక్టివ్ గా ఉంటూ మరింత పాపులర్ అయ్యాడు. ఈ మధ్య తాడికొండ టికెట్ కూడా తనకే అని ఫేస్బుక్ లో కూడా పోస్టు చేసి తన అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు.
అదే ఊపులో వ్యూహం సినిమా గురించిన టీవీ5 డిబేట్లో రామ్ గోపాల్ వర్మ తల తెస్తే కోటి బహుమానం ఇస్తా అని కేసులో ఇరుక్కుని పరారీలో ఉన్నాడు.
సీన్ కట్ చేసి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే… 2019 ముందు వరకూ అతను వైస్సార్సీపీ మద్దతుదారుడిగా ఉండేవాడు. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్త్వం మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు.
వైస్సార్సీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకుని మంత్రి పదవులను ఇవ్వడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని, సీబీఐ, ఈడిని రాష్ట్రంలోకి రానివ్వకపోవడం ద్వారా అవినీతిని ప్రోత్స్వహిస్తున్నారని అన్నారు.
ఇవే కాకుండా 87వేల కోట్ల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి కేవలం 24వేల కోట్ల రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారని అన్నారు. ప్రత్యేకహోదా విషయంలో మోడీకి మద్దతు ఇచ్చి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికలకి సుజనా అనుచరుడికి తాడికొండ టికెట్ ఇవ్వడం కూడా అమరావతిని దోచుకోవడానికి చంద్రబాబు కుట్ర అని ఆరోపించారు.
ఇలాంటి ఎన్నో స్టేట్మెంట్లు ఇచ్చిన కొలికపూడి, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆయన కోరికలు నెరవేరక టీడీపీ జత కట్టి ఇప్పుడు కరుడుకట్టిన టీడీపీ కార్యకర్త లాగా మారి, తలలకి ఇనామ్ ఇచ్చే స్థాయికి దిగజారాడు.
ఒక ఐఏఎస్ అకాడమీ నడిపే వ్యక్తి ఇంతలా దిగజారుతాడా అని ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి ఇతని వ్యాఖ్యలు. రేపు అతను ఎదురుచూసే తాడికొండ ఎమ్మెల్యే సీట్ రాకపోతే టీడీపీకి ఎదురు తిరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.