రాం గోపాల వర్మ తల నరికి తెచ్చిచ్చిన వాడికి కోటి రూపాయలు ఇస్తానంటూ ఓ టీవీ ఛానెల్ డిబేట్ లో కొలికపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.
ఎవరు ఇతను, ఒక వ్యక్తి తల నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తాననే తెంపరితనం ఎక్కడి నుండీ వచ్చింది. హత్యలు చేస్తే కోట్లు ఇచ్చే స్థాయి అతనికి ఉందా. చట్టాల్ని, వ్యవస్థల్ని తృణప్రాయంగా చూస్తూ బహిరంగంగా తలలు నరకమని ప్రోత్సాహించే ధైర్యం అతనికి ఎవరు ఇచ్చారు.
తాడికొండలో చదువుకొని, హైదరాబాద్లో అయ్యేయస్, ఐపీఎస్ కోచింగ్ సెంటర్ ఒకటి పెట్టి ఒక్క అయ్యేఎస్ ని కానీ ఐపీఎస్ ని కానీ తయారు చేయలేని విఫల జీవితం కొలికపూడిది. అటు తర్వాత సులభ ఆదాయం కోసం రాజకీయమే మార్గం అనుకొని తనకున్న తీవ్ర వ్యాఖ్యలు చేసే గుణాన్ని నమ్ముకొని 2019 కి ముందు వైసీపీ పార్టీకి అనుకూలంగా కొన్ని టీవీ డిబేట్స్ లో పాల్గొని టీడీపీ పై, చంద్రబాబు పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
అయినా వైసీపీ పార్టీ పట్టించుకోకపోవడంతో ఎన్నికల తర్వాత అమరావతి ఉద్యమంలో చొరబడ్డాడు. అమరావతి పేరిట టీడీపీ మహిళలతో చేయిస్తున్న ఉద్యమంలో ప్రవేశించే నాటికి కొలికపూడి ఆర్ధిక పరిస్థితి ఏంటో మీకు తెలుసా. గుండు సున్నా రోజూ అమరావతి ఆందోళనల్లో పాల్గొవడం అక్కడి మహిళల వద్దా అయిదూ పదివేలు అప్పుల పేరిట తీసుకొని జీవనం గడపటం చేసిన కొలికపూడికి కొన్నాళ్ళ తర్వాత ఓ ఎదురు దెబ్బ తగిలింది.
సురేష్ పోతినేని అనే టీడీపీ కార్యకర్త మా సామాజిక వర్గానికి చెందిన మహిళల్ని డబ్బుల కోసం వేదించకు అని కొలికపూడికి వార్నింగ్ ఇవ్వడం అది వివాదంగా మారి కాల్ రికార్డ్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవరకూ వెళ్లి టీ కప్పులో తుఫానులాగా సద్దుమణిగింది.
ఆ తర్వాత అంచెలంచెలుగా అమరావతి ఉద్యమ పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా ఎదిగిన కొలికపూడి ఈ రోజు రాం గోపాల వర్మ తల నరికి తెస్తే నేను కోటి రూపాయలిస్తా అనే వరకూ ఎదిగాడంటే ఆ అహంకారం వెనకున్న బలం అమరావతి పేరిట వసూలు చేసిన కోట్ల కొద్దీ చందాల్లో లెక్కలు చూపకుండా వెనకేసిన డబ్బే అని చెప్పొచ్చు .
ఒకానొక దశలో ప్రభుత్వ ఖాజానాలో 120 కోట్ల డబ్బు ఉందో లేదో కానీ అమరావతి ఉద్యమకారుల దగ్గర 120 కోట్ల రూపాయలు చందాల డబ్బు ఉందని దానితో వారు ఏమైనా చేయగలరన్నట్టు టీడీపీ అనుకూల టీవీ ఛానెల్ రిపోర్టర్ వ్యాఖ్యాణించడం మనకి తెలిసిందే.
బహిరంగంగా ప్రకటించింది 120 కోట్లు అయితే ప్రకటించంది ఎంత . ఉద్యమ ముఠాకి తెలియకుండా ఉద్యమ పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా కొలికపూడి చేతికి వచ్చిన సొమ్ము వెనకేసిన సొమ్ము ఎంత. అలా వెనకేయకపోతే రెండేళ్ల క్రితం అయిదు పది వేలు అప్పుల కోసం మహిళల చుట్టూ తిరిగిన కొలికపూడి ఈ రోజు టీడీపీ తరుపున తాడికొండ ఎమ్మెల్యే టికెట్ తనకి ఇమ్మని అడగటానికి వెనకున్న ఆర్ధిక బలం ఏంటి. ఒక వ్యక్తి తలకి కోటి వెల కట్టగలిగిన స్థోమత మరెక్కడి నుంచి వచ్చింది అనేది తరచి చూస్తే అంతా అమరావతి చందాల మూట మాయ అనిపించక మానదు.
కొసమెరుపు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పాకింగ్ పెరుగు మీద gst వేసిందని లూజు పెరుగు దోసిట్లో మోసుకొంటూ నిరసన తెలిపిన కడు బీదవాడు మన కొలికపూడి