అమరావతి ఉద్యమం పేరుతో ఈ మధ్యకాలంలో బాగా ప్రచారంలోకి వచ్చిన వ్యక్తి కొలికిపూడి శ్రీనివాస రావు. పాదయాత్ర ఇతరత్రా కార్యక్రమాల ద్వారా పేరు తెచ్చుకున్న కొలికపూడి అమరావతి ఉద్యమంలో కీలకపాత్ర పోషించడమే కాకుండా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్ల అతనికి కాలం కలిసి వచ్చింది. చంద్రబాబు అనుగ్రహం పొందడంతో పాటు రాజకీయ అరంగేట్రానికి దారులు పడ్డాయి. తదితర కారణాలను పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు తిరువూరు నియోజకవర్గం నుంచి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాడు.
అనంతరం తిరువూరు మకాం మార్చిన కొలికపూడి శ్రీనివాసరావు ప్రచారంలో తలమునకలయ్యాడు. తన అభ్యర్థిత్వాన్ని ఆమోదించాలని, ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఇంటికి తిరుగుతున్నాడు. సరిగ్గా ప్రచారం విస్తృతం చేస్తున్న సమయంలో కొలికపూడికి నిరసన సెగ తగిలింది. కొలికపూడి వద్దు శ్రీదేవి ముద్దు అంటూ తిరువూరు ప్రజల నుంచి తిరుగుబాటు మొదలైంది. ఎక్కడికి వెళ్లిన బహిరంగంగానే కొలికపూడిని వద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. అనూహ్యంగా తన మీదకు వచ్చిన ఉండవల్లి శ్రీదేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికై అనంతరం టిడిపిలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే..
అయితే ఈ ఉదంతం వెనకాల ఉండవల్లి శ్రీదేవి చక్రం తిప్పుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె కనుసన్నల్లోనే కొలికపూడిపై ప్రజలు తిరుగుబాటుకు రంగం సిద్ధమైందని ప్రచారం జరుగుతుంది. దేవుడి వరం ఇచ్చినా పూజారి అడ్డుపడుతున్నట్లు చంద్రబాబు అవకాశం కల్పించినా శ్రీదేవి రూపంలో కొలికపూడికి తలనొప్పి మొదలైంది. ఏమైనప్పటికీ కొలికపూడికి దక్కిన అదృష్టం శ్రీదేవి రూపంలో దురదృష్టంగా మారబోతుందా అంటూ తిరువూరు నియోజకవర్గంలో చర్చలు నడుస్తున్నాయి. దీనితో శ్రీదేవి రూపంలో కొలికపూడికి సెగ తగిలినట్లు అయింది.