కొలికపూడి శ్రీనివాసరావు.. పెయిడ్ అమరావతి ఉద్యమంలో ఉన్న వ్యక్తి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న స్వయం ప్రకటిత మేధావి. ఎల్లో చానల్స్‌లో తెలుగుదేశం, చంద్రబాబు నాయుడి తరఫున మాట్లాడుతూ అధికార పార్టీపై ఇస్తానుసారంగా ఆరోపణలు చేస్తుంటారు. చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై నోరు పారేసుకున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులపై నోటికి అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొద్దిరోజులుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో బాగా వైరలయ్యారు. ప్రముఖ సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తల నరికితే కోటి రూపాయలు ఇస్తానంటూ పచ్చ మీడియాలో ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా హార్ట్ టాపిక్ గా మారారు. తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో ఈయన్ను ఫాలో అవుతుంటారు. అధికర పార్టీపై మాట్లాడిన మాటలు వీడియోలను పోస్ట్ చేసి శునుకానందం పొందుతుంటారు. కాకపోతే శ్రీనివాసరావు గతంలో చంద్రబాబు మీద చేసిన వ్యాఖ్యలు చాలామంది తమ్ముళ్లకు తెలిసి ఉండకపోవచ్చు. నాడు ఆంధ్రప్రదేశ్ విద్యావంతుల వేదిక కన్వీనర్‌గా ఆయన చేసిన ప్రసంగాలు వింటే షాక్‌కు కావాల్సిందే.
అప్పట్లో ఇలా..
నేడు చంద్రబాబుపై ప్రేమ వలకబోస్తున్న కొలికపూడి టీడీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనపై ఎన్నో విమర్శలు చేశారు. వేదిక కన్వీనర్ హోదాలో హైదరాబాద్‌లో శ్వేత పత్రం విడుదల చేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాక్కొని చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని తిట్టి పోశారు. రాష్ట్రంలోకి సీబీఐ, ఈడీని రానివ్వం, ఐటీ దాడులు జరగనివ్వమనడం అంటే అవినీతి, అక్రమాలను ప్రోత్సహించడమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా సరిగ్గా అమలు చేయలేదని తూర్పారపట్టారు. ఇంటికో ఉద్యోగం, కాపుల రిజర్వేషన్లు తదితర అంశాలపై బాబు అవలంబించిన వైఖరిని తప్పు పట్టారు. ఏపీ ప్రజల్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిలువునా ముంచేశారని బాణాలు సందించారు. అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆనాటి పాలనలో రైతులు, అధికారుల నుంచి ప్రతిపక్ష నేత వరకు ఎవరికీ భద్రత లేకుండా పోయిందని ప్రకటించిన వ్యక్తి శ్రీనివాసరావు.
అయితే నేడు ఆయన చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడానికి ఎంతగానో ఆరాటపడుతున్నారు. అప్పట్లో మోసగాడిగా కనిపించిన నారావారు కొలికపూడికి ఏమి ఆశ చూపించారో ఇప్పుడు భుజాలపై మోస్తూ కీర్తిస్తున్నారు. టీడీపీ అధినేత అరెస్టు అయినప్పుడు హైదరాబాద్‌లో పెయిడ్ కార్యక్రమాలు నిర్వహించారు. మార్పు రావాలంటే బాబు గద్దె దిగాలన్న వ్యక్తి నేడు ప్రేమ చూపిస్తున్నారో పైవాడికే ఎరుక..