ఎప్పుడు ఏదో పిచ్చి పని చేస్తూ జనాలను నవ్వించే పాల్ మామ మరో పిచ్చి పనితో మన ముందుకు వచ్చాడు.. ఏపీ లో సార్వత్రిక ఎన్నికలను చివరి విడతలో నిర్వహించి ఆ వెంటనే ఓట్ల లెక్కింపు నిర్వహించేలా ఎన్నికల కమీషన్ ను ఆదేశించాలని హై కోర్ట్ ను ఆశ్రయించగా, హై కోర్ట్ తిరస్కరించింది.. చివరి విడతలో ఎన్నికలు నిర్వహించి వెనువెంటనే ఓట్ల లెక్కింపు చేయడం వలన ఏవీఎం ల ట్యాంపరింగ్ ను నిరోధించవచ్చని పాల్ గారి అభ్యర్థన.
ఇందులో కామెడీ ఏముంది అనుకోవచ్చు గానీ, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, ఎలా నిర్వహించాలి అనేది పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం యొక్క అధికారం ఈ విషయంలో కోర్టులు ఏ విధంగానూ జోక్యం చేసుకోలేవు. అది రాజ్యాంగం ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన హక్కు, భాద్యత.. ఇక రెండోది చివరి విడతలో ఎన్నికలు నిర్వహిస్తే వెంటనే ఓట్ల లెక్కింపు చేయడం వలన ఈవీఎం ల ట్యాంపరింగ్ ఆపొచ్చు అనే వాదన హాస్యాస్పదం.
ఏపీలో చివర విడతలో నిర్వహిస్తే మరోచోట ముందుగా నిర్వహించాల్సి వస్తుంది అలాంటప్పుడు అక్కడ ఈవీఎం లు ట్యాంపర్ అవ్వవా? ఈవీఎం లు ట్యాంపర్ చేయడానికి సాధ్యం కాదని ఒకపక్క ప్రభుత్వం మరోపక్క ఎన్నికల కమీషన్ పదే పదే వివరణలు ఇస్తున్న సందర్భంలో ఇప్పుడు పాల్ కోరినట్లు ఏపీ లో చివరి విడతలో ఎన్నికలు నిర్వహిస్తే పరోక్షంగా ఈవీఎం లు ట్యాంపర్ చేయవచ్చు అని ఎన్నికల కమీషనే ఒప్పుకున్నట్లు అవుతుంది. అలా అవ్వడానికి CEC ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. ఇది కాస్త అవగాహన ఉన్న ఎవరికైనా అర్థం అయ్యే విషయమే కానీ పాల్ మామ మాత్రం కోర్ట్ లలో కేస్ లు వేసి డబ్బులు వృధా చేసుకుంటూ మనకి హాస్యాన్ని అందిస్తుంటాడు..