భారతరాజ్యంగంలో కేసు తీవ్రతను బట్టి ఒక్కో రకమైన నేరానికి ఒక్కో విధమైన శిక్షా దానికి అనుగణంగానే సెక్షన్లు ఉంటాయి. అయితే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకి మాత్రం సెక్షన్లు బట్టి కేసు తీవ్రత కాకుండా , వ్యక్తులని బట్టి ఆ తీవ్రతను డిసైడ్ చేస్తూ వస్తుంది. ముఖ్యంగా ఎల్లో మీడియాగా పిలవబడే తెలుగుదేశం అనుకూల మీడియా ఈ పద్దతిని తూచా తప్పకండా పాటిస్తుంది. తమకి నచ్చని వ్యక్తులకి సంబంధించిన తీవ్రమైన కేసులని పలుచన చేసే విధంగా పత్రికల్లో శీర్షికలు పెడుతూ వస్తుంది. దీనికి ఉదాహరణే జగన్ పై జరిగిన రెండు హత్యా యత్నాల కేసులు.
2019 ఎన్నికల ముందు విశాఖ విమానాశ్రయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన హర్షవర్ధన్ నిర్వహించే ఫ్యూజన్ ఫుడ్ హోటల్ లో పనిచేసే శ్రీనివాస్ అనే వ్యక్తి నాటి ప్రతిపక్షనేతైన జగన్ పై అత్యంత పదునుగా ఉండే కోడి పందాలలో వాడే కత్తితో దాడి చేసి హత్య చేయబోతే ఇదే ఎల్లో మీడియా ఆ హత్య కేసుకి పెట్టిన పేరు కోడి కత్తి కేసు, కేవలం ఇది కేసుని పలుచన చేసే కుట్రలో ఒక భాగమే. అలాగే విజయవాడలో మేమంతా సిద్దం బస్సు యాత్ర సంధర్భంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్ పై జరిగిన దాడిని పలుచన చేస్తూ ఆ కేసుకి పెట్టిన పేరు గులకరాయి కేసు. ఇది కూడా కేవలం ప్రజల్లో కేసు తీవ్రతను తగ్గించి పలుచలన చేసే కుట్రలో ఒక భాగమే. చంద్రబాబు పై ఇదే తరహా దాడులు జరిగితే వాటికి కూడా ఇలాంటీ పేర్లే పెడతారా అంటూ పలువురు నేరుగానే ప్రశ్నిస్తున్నా విలువలు వదిలేసిన ఎల్లో మీడియాకి అవేమి పట్టవు.