సీఎం జగన్ పై పెత్తందారీ దూరహంకారులు దాడికి తెగబడ్డారు. పేదల సంక్షేమమే తన అజెండాగా వారిని పైకి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో పని చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ పై పెత్తందారులు కక్ష కట్టారు. మొదటినుండి తమ అనుకూల మీడియాలో ఆయనపై విష ప్రచారం చేస్తూ వచ్చిన పెత్తందారీ వర్గం పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం జగన్ పాలనను చూసి ఓర్వలేక పోతుందన్న మాటను అందరూ అంగీకరించాల్సిన అవసరం ఉంది.
సీఎం జగన్ అధికారంలోకి రాగానే అణగారిన వర్గాలు, పేదల జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా పని చేసారు. దీంతో తమ వ్యాపారాలకు దెబ్బ పడటమే కాకుండా తమకు విలువ లేకుండా పోయిందని పెత్తందారీ వర్గాలు భవిస్తూ వచ్చాయి.. దాంతో సీఎం జగన్ పై ఎప్పటికప్పుడు నూతన విధానాలతో బురదజల్లేందుకు ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు.. ప్రజలకు సంక్షేమాన్ని చేరువ చేయడం సంక్షేమ పథకాలకు ప్రజలకు మధ్య దళారులు, మధ్యవర్తులు లేకుండా పాలన సాగించడం వారికి కంటగింపుగా మారింది. దాని ఫలితమే ఈ దాడి అని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.
సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ ఫలాలను చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకే ఆయనను అడ్డు తొలగించుకునేందుకు కూడా ఈ పెత్తందారీ వర్గం వెనుకడలేదని చెప్పవచ్చు. అందుకే సీఎం జగన్ మొదటినుండి ఈ ఎన్నికలు పేదలకు పెత్తందారీ వర్గాలకు మధ్య జరుగుతున్న యుద్ధమని ఘంటాపథంగా చెబుతూనే వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ నడిబొడ్డున సీఎం జగన్ పై దాడికి తెగబడటం చూస్తుంటే, పెత్తందారీ వ్యక్తులు సీఎం జగన్ సంక్షేమ విధానాలను, పేదలకు చేస్తున్న మంచిని చూసి ఓర్వలేకపోతున్నారనే విషయం స్పష్టమవుతోంది. ఒకవేళ సీఎం జగన్ ఆ పెత్తందారులను మిగిలిన ముఖ్యమంత్రుల్లా ఆదరిస్తే సీఎం జగన్ పై కృత్రిమ నెగెటివిటిని సృష్టించే అవకాశం ఉండేది కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా రాష్ట్ర ముఖ్యమంత్రిపై జరిగిన ఈ దాడిని అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. త్వరలోనే ఈ దాడి వెనుక ఉన్న అసలు నిందితులు పట్టుబడాలని ఈ కుట్ర వెనుక ఉన్న అసలు దొంగలెవరో బయటకు రావాలని ఆశిద్దాం…