2024 ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలలో ఎప్పుడు లేని విధంగా ఒక ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించాయి. ప్రత్యతి ప్రతిపక్ష పార్టీలు మాది గెలుపు అంటే మాది గెలుపు అంటూ హోరాహోరీ యుద్ధాన్ని తలపించాయి. మీడియా ముందుకు రావడం పాపం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద నోటికి వచ్చినట్లు విరుచుకు పడే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూగబోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ఆయా పార్టీల నేతల ప్రెస్మీటట్లు పెట్టి ప్రజలతో మమేకమై గెలుపోటములపై తమ విశ్లేషణలను ఆలోచనలను ప్రజలతో పంచుకున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పత్తా లేకుండా పోవడం ప్రశ్నార్థకంగా మిగిలింది.
వివరాల్లోకి వెళితే.. ఈనెల 13వ తారీఖున జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆయా పార్టీల నేతలు అనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ ఎన్నికలపై తన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ నాయకులతో సభా సమావేశాలు ఏర్పాటు చేసే ఆలోచనలు పంచుకుని కుటుంబ సమేతంగా తాను రోజులు విశ్రాంతి కోసం లండన్ వెళుతుందని ప్రకటించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అమెరికా వెళ్ళడం గమనార్హం. ఆ క్రమంలో ఎల్లో మీడియా అమెరికా వెళుతున్నాడని వార్తలు వండి వాచినప్పటికీ అంతర్గతంగా ఆయన సింగపూర్లో ఉన్నాడని టిడిపి అంతర్గత వర్గాల సమాచారం.
ఏది ఏమైప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన పార్టీల నాయకులు ఎన్నికల అనంతరం కుటుంబ సమేతంగా కాస్త ఆటవిడుపు కోసం దేశం దాటి బయటికి వెళ్లినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం.. అయితే ఎన్నికల ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టకపోగా పిఠాపురంలో తన గెలుపోటములపై కార్యకర్తలతో గానీ, నాయకులతో గానీ సమాలోచనలు చేయకపోగా ఎక్కడా కనిపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన గెలుపు పై అనుమానంతో ఉన్నాడనే భావాన్ని వ్యక్తం చేస్తున్నాయి జనసేన శ్రేణులు. ఆ కారణంగానే ఎన్నికల అనంతరం ఎక్కడా కనిపించడం లేదు అంటూ జనసేన పార్టీ నాయకులే పెదవిరుస్తున్నారు. అయితే గతంలో రెండు చోట్ల భీమవరం గాజువాకలో పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఎలాగైనా ఈసారి పిఠాపురంలో గెలవాలి అని కనపడిన సొంత సామాజిక వారికి నేతలు ఎన్నికల అనంతరం పవన్ కళ్యాణ్ తీరుపై అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.