ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి నాలుగు రోజులు క్రితం హైకోర్టు లో ఊరట లభించిన విషయం తెలిసిందే, అయితే మాచర్ల అల్లర్ల నిమిత్తం ఏపీ పోలీసులు పెట్టిన మరో మూడు కేసులలో కూడా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది, ఎలక్షన్ కౌంటింగ్ ముగిసేవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులుకు ఆదేశాలు జారీ చేసింది
కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ఆయన అజ్ఞాతం వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈవీఎం ధ్వంసం కేసులో ముందస్తుగా బెయిల్ లభించిన ఏపీ పోలిసుల వివిధ కేసుల వల్ల అయన ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చింది, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు విసృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఒకనొక దశలో ఆయన దేశం విడిపోతున్నారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు అన్ని కేసులలో ముందస్తు బెయిల్ రావడంతో ఎన్నికల ఫలితాల లెక్కింపు రోజు పార్టీ క్యాడర్ కి అందుబాటులో ఉంటారని తెలుస్తుంది
ఈ కేసులు అన్ని చూస్తుంటే జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కౌంటింగ్ కేంద్రాల్లో లేకుండా చేయడానికి తెలుగుదేశం పార్టీ పన్నిన కుట్రగా తెలుస్తుంది, ఈ కేసులను కూడా హైకోర్టు తీర్పు ఇచ్చిన మే 23వ తేదీ నాడే నమోదు చేశారని, విచారణ సందర్భంగా మాత్రం ఒక రోజు ముందు అంటే మే 22వ తేదీన పిన్నెల్లిపై పెట్టినట్టుగా హైకోర్టుకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని వైసీపీ నాయకులు చెపుతున్నారు ఇదే అంశాన్ని న్యాయస్థానం ముందు పిన్నెల్లి అడ్వొకేట్ ఉంచినట్టు తెలుస్తుంది
పిన్నెల్లిపై అదనంగా మోపిన మూడు కేసులు మే 23వ తేదీన నమోదు చేసినట్టుగా వెల్లడైందని తెలిపారు. అనంతరం మే 24వ తేదీ నాడే స్థానిక మెజిస్ట్రేట్‌కు తెలియపరిచినట్టుగా రికార్డుల్లో ఉందని చెబుతున్నారు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉండగా పోలీసులు పీపీ ద్వారా, స్పెషల్ కౌన్సిల్ అశ్వనీకుమార్ ద్వారా కోర్టుకు ఎందుకు తప్పడు సమాచారం ఇచ్చారో అర్థం కావట్లేదని పిన్నెల్లి తరఫు న్యాయవాది పేర్కొన్నట్లు తెలుస్తుంది