అసత్యపు ప్రచారాలతో అంట కాగడం తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి ఉన్న అలవాటే.. సంబంధం లేని ప్రతి విషయాన్ని అనుకూలంగా మార్చుకుంటూ టీడీపీఅనుకూల ఎల్లో మీడియా, అనుబంధ విభాగాలతో తప్పుడు ప్రచారాలు చేయటం టిడిపికి ఆనవాయితీ… తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడి రాజకీయాలు ఎప్పుడు బట్ట కాల్చి మీద వేసే చందాన ఉంటాయనేది చరిత్ర చెబుతున్న విషయం. ఆ క్రమంలోనే మాచర్లలో జరిగిన అల్లరి విషయంలో మరో తప్పుడు ప్రచారానికి తెర తీసి నవ్వులు పాలయింది తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా.
వివరాల్లోకి వెళ్తే… ఎన్నికల అనంతరం మాచర్లలో జరిగిన అల్లర్లు రాష్ట్రం మొత్తం మీద ఎంత అలజడి రేపాయో అందరికీ తెలిసిందే. అయితే అల్లర్లకి కారణం వైసిపి కార్యకర్తలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదన్న కారణంతోనే గొడవలకు దిగారని, టిడిపి కార్యకర్తలపై దాడికి తెగించారంటూ అనేక రకాలుగా చిలవలు పలవలు చేసి తప్పుడు రాతలు రాస్తూ జనాల మనసుల్లో విషాన్ని నింపడమే పనిగా పెట్టుకుంది. అయితే మాచర్లలో జరిగిన అల్లర్లలో గాయపడిన మహిళ లీలావతి నోరు విప్పడంతో ఈ అల్లర్ల వెనక అసలు నిజాలు బయటపడ్డాయి.
అయితే ఇన్ని రోజులూ వ్యక్తిగత గొడవలకు రాజకీయ రంగు పులిమి రాక్షసానందం పొందింది తెలుగుదేశం పార్టీ.. కానీ పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన స్థానికురాలు లీలావతి అనే మహిళ కేవలం ఇది వ్యక్తిగత గొడవల కారణంగా మాత్రమే జరిగిన గాయాలని రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని అసలు విషయం చెప్పడంతో ఎల్లో మీడియా ముక్కున వేలు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో అసలు పార్టీల ప్రస్తావన తీసుకురావటం టిడిపి చేస్తున్నటువంటి దుష్ప్రచారమే అని తేల్చి చెప్పింది. ఇప్పటిదాకా అబద్ధపు ప్రచారాలతో తప్పుడు కథనాలు వండి వారిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టి తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా నవ్వులపాలయ్యాయి.