ఏపీ ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడిన తరువాత ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి మారిందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో జరుగుతున్న సంఘటనలను బట్టి మేం మాట్లాడాల్సి వస్తుందని చెప్పారు
టీడీపీ పోస్టల్ బ్యాలెట్‌పై ఓ ఇమెజ్‌ను క్రియేట్ చేసుకొని గతంలో ఎప్పుడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్‌పై నమ్మకం పెట్టుకున్నారు. గతంలో పోస్టల్ బ్యాలెట్ కవర్‌పై సీరియల్ నంబర్ లేదని రిజెక్ట్ చేశారు. ఈసారి ఏమీ లేకున్నా పరిగణలోకి తీసుకోవాలని టీడీపీ వాళ్లే ఈసీని అడుగుతున్నారు. ఈసీఐ ఏ గైడ్‌లైన్స్ ఇచ్చినా దేశమంతా ఒకే విధంగా ఉండాలి.దేశమంతా ఎలాంటి నిబంధనలు ఉంటాయో ఇక్కడ కూడా అవే నిబంధనలు అమలు చేయాలని మేం కోరుతున్నాం. ఇక్కడ డిఫరెంట్‌గా ఉన్న గైడ్‌లైన్స్‌పై ఇవాళ వినతిపత్రం కూడా ఇచ్చాం.
ఎన్నికల కమిషన్ అన్నది నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నదే మా ఉద్దేశ్యం,అందుకే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి మా పార్టీ, ముఖ్యమంత్రితో సహ ఈసీ ఏ నిర్ణయం తీసుకున్నా ఇద్దరికి సమానంగా ఉండేలా నిర్ణయం తీసుకోవాలని మేం కోరుకున్నాం. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడిన నాటి నుంచి ఎన్నికల కమిషన్‌కు చంద్రబాబు వైరస్ సోకినట్లుగా ఉంది.
చంద్రబాబు గతంలో ఎన్నికల కమిషన్‌పై ఎలా దాడికి వెళ్లారో చూశాం. వైయస్ జగన్ ఎప్పుడూ ఈసీపై ఆయనలా వ్యవహరించలేదు. అధికార వ్యవస్థ, ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తోంది.కేవలం వ్యవస్థలను మేనేజ్‌చేయడమే లక్ష్యంగా చంద్రబాబు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకున్నారు.
టెర్రరైజ్ చేసి బెదిరించి తమ వైపు తిప్పుకునేలా చంద్రబాబు, టీడీపీ వ్యవహరిస్తోంది. వ్యవస్థలను మేనేజ్ చేయడం, దారిలోకి రాని వాళ్లను మీడియాతో గ్లోబెల్స్ ప్రచారంతో కాళ్ల బేరానికి తెచ్చుకోవడంలో చంద్రబాబు దిట్ట. ప్రధాని మోదీనే చంద్రబాబు, ఎల్లోమీడియా గ్లోబెల్స్ ప్రచారానికి తట్టుకోలేకపోయాడు. వ్యక్తిత్వ హననం చేసి లబ్ది పొందాలన్నదే చంద్రబాబు నైజం. ఎన్నికల సమయంలో చీఫ్ సెక్రటరీని తప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ అన్నది అబద్ధాలపై బతుకుతున్న పార్టీ. వ్యవస్థను తన చేతుల్లోకి తెచ్చుకునేందుకు చంద్రబాబు ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. వైల్డ్ ఆరోపణలతో సీఎస్‌ను తప్పించాలనే ఇన్‌ఫ్లూయేన్స్ చేసే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈసీ కక్షసాధింపు ధోరణిలో వెళ్లాల్సిన అవసరమేంటి ? కౌంటింగ్ సమయంలోనైనా ఈసీ నిష్పక్షపాతంగా వ్యవరించాలని మేము కోరుకుంటున్నట్లు సజ్జల రామకృష్ణ పేర్కొన్నారు