ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికలు ఎంత ఉత్కంఠను రేకెత్తిస్తూ జరిగాయో, అంతకుమించిన ఆశక్తిని కలిగించింది పిఠాపురం నియోజకవర్గ పోటీ… దానికి కారణం పిఠాపురం నియోజకవర్గ నుండి కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ఒక కారణమైతే… అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పిఠాపురం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా శాసనసభ సభ్యురాలుగా విశేష సేవలు అందించి, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు […]
2024 ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలలో ఎప్పుడు లేని విధంగా ఒక ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించాయి. ప్రత్యతి ప్రతిపక్ష పార్టీలు మాది గెలుపు అంటే మాది గెలుపు అంటూ హోరాహోరీ యుద్ధాన్ని తలపించాయి. మీడియా ముందుకు రావడం పాపం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద నోటికి వచ్చినట్లు విరుచుకు పడే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూగబోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ఆయా […]
2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల రాజకీయాలు వాడి వేడిగా సాగిన సంగతి తెలిసిందే. అధికార వైరి పక్షాల మధ్య పోటీ ఎంత ఉత్కంఠను రేపిందో చూసాం… అయితే రాష్ట్ర రాజకీయాలు ఒక ఎత్తు అయితే పిఠాపురం నియోజకవర్గ రాజకీయాలు మరొక ఎత్తుగా సాగాయి. కారణం కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగా గీత పై పిఠాపురం నియోజకవర్గం నుంచి […]
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీతో రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారిన పిఠాపురంలో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు వైసీపి అభ్యర్ధి వంగా గీత. ప్రజలు తమ పార్టీకి అనుకూలంగా ఉన్నారని, ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వనివి కూడా నేరవేర్చిన సీఎం వైయస్ జగన్ గారినే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకున్నారని, దాని ఫలితమే పెద్ద ఎత్తున మహిళలు వృద్దులు సైతం తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారని వంగా గీత వెల్లడించారు. పవన్ […]
ఏపీలో ఎన్నికలు ముగిసాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో రికార్డు స్థాయిలో పోలింగ్ సగటు నమోదైంది. కాగా ఈ ఎన్నికల్లో సీఎం జగన్ ఒంటరిగా బరిలోకి దిగగా, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికల్లో పోటీ పడ్డాయి. కాగా పలువురు ప్రముఖులు ముఖ్య నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకోగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతేకాకుండా తన భార్యను పోలింగ్ […]
సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులతో పోలిస్తే దూకుడుగా ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపు పడనుంది. పిఠాపురం వేదికగా జరగబోయే బహిరంగ సభతో సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 44 రోజుల్లో ఏకంగా 118 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచారం నిర్వహించడం విశేషం. చివరి 12 రోజుల్లో 34 సభల్లో జగన్ పాల్గొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిన […]
వైయస్ జగన్ పదే పదే చెబుతూ వస్తున్న కూటమి పెత్తందారీ మనస్తత్వాలు వారి మాటల ద్వారా అప్పుడప్పుడు బయట పడుతూనే ఉన్నాయి. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిపై నిత్యం విషం చిమ్ముతూ వారి ఎదుగుదలను అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్న ఈ కూటమి పైకి కపట ప్రేమను నటిస్తూ లోలోన పేదవారిపై కుట్రలు చేస్తునే ఉన్నారనేది పవన్ కళ్యాణ్ తాజాగా పంచుకున్న అభిప్రాయంతో తేలిపోయింది. ఒక ఇంగ్లీష్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ముస్లిం రిజర్వేషన్లకు […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఊడిగం చెయ్యటానికి రాజకీయాల్లోకి వచ్చాడని పోతిన మహేష్ దుయ్యబట్టారు. 2014లో సాధారణ అపార్ట్మెంట్లో ఉంటున్నానని, కారు ఈఎంఐ కట్టలేనని పవన్ కళ్యాణ్ చెప్పాడని కానీ 2024 నాటికి తిరగటానికి సొంతంగా హెలికాప్టర్, 1500 నుంచి 2 వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని పోతిన మహేష్ ప్రశ్నించారు. ఆస్తుల కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడని, నాలాంటి పార్టీని నమ్ముకున్న వాళ్లను తాకట్టు పెట్టి లగ్జరీ కార్లు కొన్నాడని, […]
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరగనున్న 2024 సార్వత్రిక ఎన్నికల జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రమంతటా ఉన్న ఎన్నికల వేడి ఒక ఎత్తు అయితే పిఠాపురంలో ఈ వేడి మరొక ఎత్తుగా మారింది. పిఠాపురం రాజకీయాలు రోజుకు ఒక రీతిన మారుతూ అభ్యర్థులు, కార్యకర్తలు, నాయకుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ప్రత్యర్థి ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులతో గెలుపోటములు దాగుడుమూతలు ఆడుతున్నాయి. ఈ ఎన్నికలలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వంగా గీత, కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన […]
గన్నవరం శాసన సభ్యులు వల్లభనేని వంశీ, పవన్ వాఖ్యలపై ఘాటుగా స్పందించారు. చంద్రబాబు భార్య నారా భువనేశ్వరీని తాను అసెంబ్లీలో ఏదో అన్నానని ప్రచారం చేయడం పవన్ కళ్యాణ్ అవగాహనా రాహిత్యం అని దుయ్యబట్టారు. నిజానికి ఆ ఘటన జరిగిన రోజున అసలు తాను అసెంబ్లీలోనే లేనని వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ చెప్పుడు మాటలు విని తనపై నిందలు మోపడం తప్ప తనకి నిజాలు అర్ధం చేసుకుని స్పందించే స్థాయి లేదని విమర్శించారు తెలుగుదేశం పార్టీలో […]