జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీతో రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారిన పిఠాపురంలో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు వైసీపి అభ్యర్ధి వంగా గీత. ప్రజలు తమ పార్టీకి అనుకూలంగా ఉన్నారని, ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వనివి కూడా నేరవేర్చిన సీఎం వైయస్ జగన్ గారినే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకున్నారని, దాని ఫలితమే పెద్ద ఎత్తున మహిళలు వృద్దులు సైతం తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారని వంగా గీత వెల్లడించారు. పవన్ కళ్యాణ్ కూటమితో వచ్చినా ప్రజలు వారిని విశ్వసించలేదని ఆమె తన అభిప్రయాన్ని వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ కేవలం కులం కార్డు ఆధారంగానే పిఠాపురంలో ఎన్నికల బరిలో నిలిచారనే వాదన మొదటినుండి ప్రజల్లో బలంగా వినిపించింది . ఆయన సొంత సామాజిక వర్గ ఓట్లు మొత్తం తనకే గంప గుత్తుగా పడతాయని దాని మూలానా సునాయాసంగా ఎమ్మెల్యే అయిపోవచ్చని ఆశ పడ్డ పవన్ కళ్యాణ్ కు ప్రజలు షాక్ ఇచ్చారనే వాదన బలంగా వినిపిస్తుంది. కులం ఆధారిత ఓటింగ్ కు ప్రజలు దూరంగా ఉండి తమకి ఎవరు ఎన్నికల తరువాత అందుబాటులో ఉంటారో వారికే ప్రజలు పట్టం కట్టారని చెబుతున్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారిన పిఠాపురంలో ఎవరు గెలుస్తారనేది మరి కొదిరోజుల్లోనే తేలిపోనుంది.