వైయస్ జగన్ పదే పదే చెబుతూ వస్తున్న కూటమి పెత్తందారీ మనస్తత్వాలు వారి మాటల ద్వారా అప్పుడప్పుడు బయట పడుతూనే ఉన్నాయి. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిపై నిత్యం విషం చిమ్ముతూ వారి ఎదుగుదలను అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్న ఈ కూటమి పైకి కపట ప్రేమను నటిస్తూ లోలోన పేదవారిపై కుట్రలు చేస్తునే ఉన్నారనేది పవన్ కళ్యాణ్ తాజాగా పంచుకున్న అభిప్రాయంతో తేలిపోయింది. ఒక ఇంగ్లీష్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేసిన వాఖ్యలు పేద ముస్లిం సమాజాన్ని తీవ్రంగా బాధించే అంశం.
బీజేపీ మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్న ముస్లిం రిజర్వేషన్ల రద్దు అంశానికి చంద్రబాబు చీకట్లో మద్దతు పలికితే పవన్ కళ్యాణ్ మాత్రం బహిరంగంగానే మద్దతు పలికారు. సదరు ఇంటర్వ్యూలో సంబంధిత మీడియా ఛానల్ ప్రతినిధి ముస్లింలకు సంబంధించి బీజేపీ అవలంభిస్తున్న వైఖరి గురించి పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించినప్పుడు, బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదంటూ నమ్మబలికే ప్రయత్నం చేశారు. అయితే వెంటనే ఛానల్ ప్రతినిధి బీజేపీ ముస్లిం రిజర్వేషన్లు అమలుచేయబోమని చెబుతున్న అంశాన్ని ప్రస్తావించగా ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ నేతల ప్రకటనలపట్ల తానేమీ నిరాశ చెందడంలేదని, రిజర్వేషన్ల అమలుకన్నా ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలు పెంచేలా వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వాలని స్పష్టత లేకుండా మాట్లాడి బీజేపీ అద్దె మైక్ గా ప్రవర్తించారు. పవన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ముస్లిం సమాజం తీవ్రంగానే వ్యతిరేకిస్తుంది.