ఐపీఎల్ 2024 భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్ తో ముంబయి ఇండియన్స్ కీలక పోరుకు సిద్దమైంది.
లక్నోలోని ఎకానా స్టేడియంలో ఈ రోజు రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో లక్నో సూపర్ జైంట్స్ , అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ముంబై ఇండియన్స్ జట్లు ఓటములు చవిచూసాయి, దీంతో ఇరు జట్లు కూడా ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలని చూస్తున్నాయి. మరోవైపు లక్నోతో జరిగే ఈ మ్యాచ్లో ముంబై విజయం సాధించడం చాలా ముఖ్యం, ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ తప్పక గెలవాలి.
లక్నో సూపర్ జెయింట్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ఉంది. మరోవైపు ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడగా మూడింటిలో మాత్రమే గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో అంటే 9వ స్థానంలో ఉంది..