ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది. 78 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది. హైదరాబాద్ బ్యాటర్లను చెన్నై బౌలర్లు కట్టడి చేయడంతో చెన్నై ఈ విజయాన్ని నమోదు చేసింది.
213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ .. 18.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. హైదరాబాద్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు, ఈ మ్యాచ్ లో ఓటమితో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్ పాండే కీలకమైన 4 వికెట్లు తీసి.. జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ముస్తాఫిజుర్, పతిరన తలో రెండు వికెట్లు పడగొట్టారు. జడేజా, శార్ధూల్ ఠాకూర్ కు తలో వికెట్ దక్కింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 98 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. గైక్వాడ్ ఇన్నింగ్స్ లో 3 సిక్సులు, 10 ఫోర్లు ఉన్నాయి. అతనికి తోడు శివం దూబే 39 పరుగులతో సహకారం అందించాడు.హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉనద్కత్ తలో వికెట్ తీశారు., ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యాడు