ఐపీఎల్ 2024నేపథ్యంలో నిన్న చెన్నై చేపాక్ స్టేడియంలో జరిగిన చెన్నై పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 162 పరుగులకే పరిమితం అయింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (62; 48 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్ లు ) ఒక్కడే రాణించడంతో చెన్నై స్వల్ప స్కోరేక్ పరిమితమైంది.
మొదటి వికెట్ కు 64 పరుగుల భాగస్వామ్యం లభించినప్పటికీ భారీ స్కోర్ నమోదు చేయడంలో చెన్నై బ్యాటర్లు విఫలమయ్యారు రుతురాజ్ ఒక్కడే అర్థసెంచరీ సాధించాడు అజింక్యా రహానె 24 బంతుల్లో 29 పరుగులు (5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. శివమ్ దూబె (0), జడేజా (2) ఘోరంగా విఫలమయ్యారు. సమీర్ రిజ్వీ (21), మొయిన్ (15), ధోనీ (14) పరుగులు చేశారు.
పంజాబ్ బౌలర్లలో హరీత్ బ్రార్, చాహర్ తలో 2 వికెట్లు తీయగా రబాడ, అర్ష్‌దీప్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన పంజాబ్ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జానీ బెయిర్ స్టో 30 బంతుల్లో 46 పరుగులు ( 7 ఫోర్లు, 1 సిక్స్), రిలీ రోసోవ్ 23 బంతుల్లో 43 పరుగులు ( 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగి ఆడారు. శశాంక్ (25*), సామ్ కరన్ (26*) పరుగులు చేసి పంజాబ్ ను విజయతీరాలకు చేర్చారు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబె, రిచార్డ్ గ్లీసన్ ఒక్కో వికెట్ తీశారు.ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ నాలుగింట్లో విజయం సాధించగా, చెన్నైకి ఇది ఐదో ఓటమి.
హరప్రీత్ బరార్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది