ఐపీఎల్ 2024 – 14 వ మ్యాచ్‌లో ఈరోజు ముంబాయ్ వాఖండే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ , ముంబాయి ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి . రాజస్థాన్ రాయల్స్ ఆడిన రెండు మ్యాచ్ ల్లో గెలవగా ముంబాయి ఇండియన్స్ ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది
హార్ధక్ పాండ్యా కెప్టెన్సీ స్వీకరించాక ముంబాయి ఇండియన్స్ హోం గ్రౌండ్ లో ఆడుతున్న మ్యాచ్ ఇది , ఈ మ్యాచ్ లో అయినా గెలుస్తామని అటు టీం మెంబర్స్ తో సహా టీం యాజమాన్యం కూడా ఆశిస్తుంది
అటు రాజస్థాన్ రాయల్స్ కూడా ఈ మ్యాచ్ గెలిచి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకోవాలని చూస్తుంది అయితే ఆ జట్టు ఓపెనర్లు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ ల్లో మంచి ఆరంభాన్ని ఇచ్చిన దాఖాలాలు లేవు ఈ మ్యాచ్ లో అయినా ఓపెనర్లు ఫామ్ లోకి వస్తారని టీం భావిస్తుంది
ఈ పిచ్ చేజింగ్ కి అనుకూలంగా ఉంటుంది , ఏ జట్టు టాస్ గెలిచినా ముందుగా బౌలింగ్ ను తీసుకుంటారు
ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 28 మ్యాచ్‌లు జరగ్గా ముంబాయి 15, రాజస్థాన్ 12 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు
ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా) :
రాజస్థాన్ రాయల్స్ :
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్/వికెట్‌కీపర్), రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్‌మైర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చహల్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్
ముంబై ఇండియన్స్ :
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, క్వేన మఫాకా