ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ విజయం సాధించింది. మొదట గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ చేసి, నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 84 పరుగులు , షారుఖ్ ఖాన్ 58 పరుగులు చేయడంతో ఆ జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది .
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే కేవలం ఒక వికెట్ కోల్పోయి గుజరాత్ టైటాన్స్ పై చిరస్మరనీయ విజయాన్ని అందుకుంది. విల్ జాక్స్ 41 బంతుల్లో 100 నాటౌట్, ( 5 ఫోర్లు, 10 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా.. కింగ్ కోహ్లీ 44 బంతుల్లో 70 పరుగులు ( 6 ఫోర్లు, 3 సిక్స్ లు ) తో సూపర్ ఇన్నింగ్స్ ఆడారు . దీంతో ఆ జట్టు కేవలం 16 ఓవర్లలోనే లక్షాన్ని చేరుకుని రికార్డ్ నెలకొల్పింది . ఇప్పటివరకు 10 మ్యాచ్ లు ఆడిన బెంగళూరు జట్టుకు ఇది మూడో విజయం. ఈ గెలుపుతో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తన ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది
అధ్బుత సెంచరీ సాధించిన విల్ జాక్స్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది