ఐపీఎల్లో ఇవాళ మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ జరుగనుంది. లక్నో సూపర్ జెయింట్స్.. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది. లక్నో హోం గ్రౌండ్ అయిన భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎఖానా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ సీజన్లో లక్నోతో పోలిస్తే చెన్నై ఓ అడుగు ముందుంది. చెన్నై ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించగా.. లక్నో 6 లో 3 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ప్రస్తుతం చెన్నై 3, లక్నో 5 స్థానాల్లో కొనసాగుతున్నాయి.
ఇరు జట్లు ఇప్పటివరకు తలపడిన మ్యాచ్ లను పరిశీలిస్తే.. రెండు మ్యాచ్ లు జరగగా చెరో మ్యాచ్‌లో విజయం సాధించాయి. బలాబలాల చుస్తే లక్నోతో పోలిస్తే చెన్నై అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుంది. చెన్నైలో అందరు ఆటగాళ్లు తలో చేయి వేస్తూ జట్టు విజయాలకు దోహదపడుతున్నారు. లక్నో విషయంలో టీమ్ వర్క్ కొరవడింది. యువ పేసర్ మయాంక్ యాదవ్ లేని లోటు లక్నోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్‌లో ఎవరిది పై చేయి అవుతుందో వేచి చూడాలి.