అనునిత్యం జగన్ ప్రభుత్వంపై ఏడవడమే పనిగా పెట్టుకున్న ఎల్లో మీడియాకి జగన్ ప్రభుత్వానికి సంబంధించి ఏ చిన్న విషయాన్నైనా గోరంతని కొండంత చేసి చూపించడం, రాయటం పరిపాటి అయిపోయిందని మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారులకు ఇచ్చే వేతనం పైనా తన ఏడుపును చూపించింది.
సలహాదారులకు 680 కోట్ల ఖర్చు అంటూ ఎల్లో మీడియా కాకమ్మ కధలను వండి వార్చింది. ప్రభుత్వం ఇచ్చే ఏ జీతానికైనా లెక్కా పత్రం ఉంటుందని తెలిసి కూడా రాసిన విషపు రాతలు ఇవి. పైగా ఈ 680 కోట్లలో సజ్జలకే 140 కోట్ల చెల్లింపు అంటూ మరొక కొసమెరుపు కూడా.
ఇక నిజాల విషయానికి వస్తే ప్రభుత్వ సలహాదారులకు, వారి సిబ్బందికి జీతాలు, అలవెన్సులు, ఇంటి అద్దె రూపంలో, కారు సౌకర్యం రూపంలో మొత్తంగా చెల్లించింది కేవలం రూ.48 కోట్లు.
సజ్జల రామకృష్ణారెడ్డికి, ఆయన సిబ్బందికి, కారు, ఇంటి అద్దె అలవెన్స్ రూపంలో చెల్లించింది కేవలం రూ.1.65 కోట్లు (ఒక కోటి 65 లక్షలు ).
అసలు 1.65 కోట్లను వందింతలు చేసి 140 కోట్లంటూ ప్రచారం చేయడం ఈ ఎల్లో మీడియాకే చెల్లింది.