2024లో ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఒకవైపు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీఒంటరిగా బరిలోకి దిగుతుండగా మరోవైపు టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు కూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో గెలవబోయేది ఆ పార్టీనే అంటూ ఇండియా టుడే యాంకర్ రాజ్ దీప్ సర్దేశాయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
రాజ్ దీప్ సర్దేశాయ్ మాట్లాడుతూ ఏపీలో హోరాహోరీగా ఎన్నికలు జరగబోతున్నాయని, కానీ గెలవబోయేది ఆ పార్టీనే అంటూ సంచలన కామెంట్స్ చేశారు. డైరెక్ట్ గా చెప్పను కానీ చిన్న హింట్ ఇస్తానంటూ ఆయన కొన్ని విషయాలు వెల్లడించారు. ఏపీలో జరగబోయే ఎన్నికల్లో మహిళల ఓట్లు, గ్రామ ప్రజల ఓట్లు కీలకంగా మారనున్నాయని, ఈ ఓట్లను ఏ పార్టీ కొల్లగొడుతుందో ఆ పార్టీ విజయం సాధించబోతుందని రాజ్ దీప్ సర్దేశాయ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
కాగా మహిళల ఓట్లు, గ్రామ ప్రజల ఓట్లు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే పడతాయని అంచనాలున్న నేపథ్యంలో ఇండియా టుడే యాంకర్ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని వెల్లడించారని సోషల్ మీడియా వేదికగా పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పేద ప్రజల బాగు కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాకుండా, మహిళలకు సంక్షేమ పథకాల్లో పెద్ద పీట వేసిన ముఖ్యమంత్రి జగన్ కి కాకుండా మరొకరికి మహిళలు & పేద ప్రజల ఓట్లు పడే అవకాశమే లేదని మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడం ఖాయమన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజ్ దీప్ సర్దేశాయ్ మాట్లాడిన వీడియో ట్రెండింగ్ లో ఉండటం విశేషం.