జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విచిత్రమైన వ్యక్తి. తనను తాను మంచివాడుగా చిత్రీకరించుకుంటాడు. చేయని పనులను కూడా చేశానని ఎలాంటి సంకోచం లేకుండా చెప్పేస్తాడు. బహుశా ఆయన మాటల్ని గుడ్డిగా నమ్మే గొర్రెల్లాంటి అభిమానులు ఉండడమే కారణం కావొచ్చు. పవన్‌కు నెల్లూరుతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన తండ్రి వెంకట్రావు ఉద్యోగరీత్యా కొంతకాలం ఇక్కడ ఉన్నప్పుడు చదువుకున్నాడు. రాజకీయాల్లోకి వచ్చాక ఈ ఊరి పేరు సేనాని అనేకసార్లు వాడాడు. నోటికొచ్చింది చెప్పేశాడు.
తను అడిగే ప్రశ్నలకు టీచర్లు సమాధానలు చెప్పలేకపోయేవారని, అందుకే ఉన్నత చదువులకు వెళ్లలేకపోయాయని ఓసారి పవన్ అన్నాడు. చదువే అబ్బని ఈ పెద్దమనిషి శుక్రవారం నగరంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ‘ఓ స్నేహితుడి సాయంతో నెల్లూరులోని ఓ పుస్తకాల దుకాణంలో ఉచితంగా చదువుకునే అవకాశం వచ్చింది. ఆ జ్ఞానం ప్రజల కోసం గూండా ప్రభుత్వంపై పోరాడేందుకు ఉపయోగపడింది’ అన్నాడు. ఈ మాట విన్నాక చాలామందికి జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్లాలని అనిపించడంలో ఎలాంటి తప్పు లేదు.
వాస్తవానికి పవన్ క్వాలిఫికేషన్ పదో తరగతి మాత్రమే. ఇంటర్ తప్పాడు. కానీ విదేశాల్లో పెద్ద యూనివర్సిటీలో చదివిన వ్యక్తిలా బిల్డప్ ఇస్తాడు. రెండు లక్షల పుస్తకాలు చదివానని చాలా సందర్భాల్లో అన్నాడు. పబ్లిక్ మీటింగ్‌లు, పార్టీ సమావేశాలు జరుగుతున్న సమయంలో పుస్తకం చదువుతున్నట్లు ఫొటోకు ఫోజు ఇచ్చాడు. తన రూంలో వందల సంఖ్యలో పుస్తకాలు ముందేసుకుని కళ్లద్దాలు పెట్టుకుని నోట్స్ రాస్తున్న ఫొటోలను తన పీఆర్ టీం ద్వారా సోషల్ మీడియాలో వదిలాడు. పవన్ బతకనేర్చిన వాడు. చదివింది పదో తరగతి అయినా నా సలహాలు తీసుకుని రాజ్యాంగాన్ని రాశారన్నంతగా ప్రవర్తిస్తాడు.
2019లో నెల్లూరుకు వచ్చినప్పుడు ఇక్కడి ఉప్పు చాలా ఉప్పగా ఉంటుందని చెప్పాడు. దీనిని ఇంత వరకూ ఎవరూ డీకోడ్ చేయలేపోయారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో ‘ఓ పుస్తకాల దుకాణంలో ఉచితంగా చదువుకునే అవకాశం వచ్చింది. ఆ జ్ఞానం ప్రజల కోసం గూండా ప్రభుత్వంపై పోరాడేందుకు ఉపయోగపడింది’ అన్నాడు. సరే కాసేపు ఆయన్ను జ్ఞానసంపన్నుడనే ఒప్పుకొందాం. అంతటి జ్ఞానం ఉన్నప్పుడు 2014 – 19 మధ్య సీఎం హోదాలో అవినీతికి పాల్పడిన చంద్రబాబుపై నేడు ఎందుకు పోరాడలేదు. టీడీపీ హయాంలో జరిగిన అక్రమాల గురించి ఎందుకు మౌనం వహించాడు. ప్రజలను ఇబ్బందులు పెట్టిన తెలుగు తమ్ముళ్లను ఎందుకు గెలిపించాలని కోరుతున్నాడు. అసలు వారితో పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు. అంటే ఆ పుస్తకాల్లో మంచిపై మాత్రమే పోరాడాలని రాసుందేమో.. కళ్యాణ్ చెప్పాలి. ప్రజలకు మేలు జరగకుండా చూడాలని ఆయన చదివిన పుస్తకాల్లో ఉందేమో.. ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అడ్డుకోవాలని చూశాడు. దీనిని బట్టి సేనాని పోరాటతత్వం నేర్పే పుస్తకాలు చదవలేదని అర్థమవుతోంది. అప్పుడు టీనేజీలో ఉన్నాడు కదా.. వేరేవి చదివి ఉంటాడు.