తమవారి నుండి కొనుగోలు చేసిన స్టీలు నాసిరకంగా ఉండటమే కాకా విశాఖ స్టీల్ ధరతో పోలిస్తే టన్నుకు 500 చొప్పున అధిక ధరకి కొనుగోలు చేయించారు… దాని ద్వారా కోట్ల రూపాయల అవినీతి జరిగింది… మొత్తం మూడు లక్షల ఇళ్ల నిర్మాణం లో కోట్లాది రూపాయాలు ప్రభుత్వ సొమ్ము అవినీతిపరుల పాలయ్యింది…
పేదలకు పక్కా ఇళ్లు నిర్మించడానికి తలపెట్టిన హౌసింగ్ కార్పొరేషన్ ను బాబు ముందు నుండీ అవినీతి మయం చేశాడు. అధికారం లో ఉన్న ప్రతీసారీ ఇళ్ల నిర్మాణం లో భారీ ఎత్తున దోపిడీ పర్వమే..
దానికి సాక్ష్యమే 1996 లో వచ్చిన ఈ వార్త..
గృహ నిర్మాణ సంస్థ ద్వారా నిర్మించే ఇళ్లలో స్టీల్ కొనుగోలు లో భారీ స్థాయిలో అవినీతి జరిగింది.. తన సన్నిహితులైన వ్యాపారుల దగ్గర మాత్రమే స్టీల్ కొనుగోలు చేయాలని జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. లబ్దిదారుల ఖాతాలోకే నిధులు జమచేసి తద్వారా తమకు నచ్చిన వారి దగ్గర నుండే స్టీల్ ను కొనుగోలు చేసేవిధంగా (DBT) ఉన్న నిబంధనలను ను పక్కనబెట్టి మరీ నిధులు లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేయకుండా ప్రభుత్వమే స్టీల్ కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందించే విధంగా రాష్ట్రస్థాయిలో ఆదేశాలు జారీ చేసారు. తమవారి నుండి కొనుగోలు చేసిన స్టీలు నాసిరకంగా ఉండటమే కాకా విశాఖ స్టీల్ ధరతో పోలిస్తే టన్నుకు 500 చొప్పున అధిక ధరకి కొనుగోలు చేయించారు… దాని ద్వారా కోట్ల రూపాయల అవినీతి జరిగింది… మొత్తం మూడు లక్షల ఇళ్ల నిర్మాణం లో కోట్లాది రూపాయాలు ప్రభుత్వ సొమ్ము అవినీతిపరుల పాలయ్యింది…
దీనిలో చంద్రబాబు హస్తం ఉందని అప్పట్లో అసెంబ్లీ లో ప్రతిపక్షాలు చర్చకు ప్రతిపాదిస్తే దానిని పెడచెవిన పెట్టి అసలు చర్చే జరగకుండా అడ్డుకోగలిగాడు… తన హస్తం లేకుంటే కనీసం చర్చకైనా ఆహ్వానించాల్సింది. అవసరం అయితే విచారణ అయినా చేపట్టలసింది, కానీ అలాంటివేం బాబు హయాం లో జరగవు…
ఇలా చిన్నా చితకా కార్యక్రమాల నుండి ప్రతీ పథకంలోను అవినీతిని ప్రోత్సహిస్తూ అందిన కాడికి దోచుకునేలా… తనకు, తన వారికి లబ్ది చేకూరుస్తూ తన కుర్చీని కాపాడుకున్నాడు.. ప్రభుత్వ పథకాలు అంటే తన సొంత ఆస్థిగా భావించి ప్రతీ అంశంలోనూ, సంక్షోభంలోనూ అవకాశాన్ని శృష్టించుకుని తన ఆదాయ వనరుగా మార్చుకున్నాడు చంద్రబాబు…