ఈసారి రేషన్ వెహికల్స్ వంతు….
నిజానికి లోకేష్ లాగులు వేసుకొనే వయసులో చంద్రబాబు ఏం చెప్పాడో తెలుసా.
ఆంధ్రప్రదేశ్ లోని రేషన్ వాహనాల దగ్గర ప్రజలు క్యూ కడుతున్నారు . వాళ్లకి ఇంటి వద్ద డెలివరీ ఇవ్వట్లేదు
రేషన్ వాహనాల కోసం వందల కోట్లు దుబారా చేశారు. మమ్మల్ని గెలిపిస్తే మళ్ళీ రేషన్ షాపుల వాళ్ళకే భాద్యతలు అప్పజేప్పి వారి ఆదాయం పెంచుతానంటూ నిన్న జరిగిన యువగలంలో ఆరోపించారు నారా లోకేష్. .. ???
నిజానికి రెక్కాడితే కానీ డొక్కాడని పేదలకు అలా క్యూలో నిలబడే ఇబ్బందులు దరిచేరకుండా, ఒక పూట పనికెళ్ళకపోతే గడవని బ్రతుకులు రేషన్ బియ్యం కోసం ఎదురుచూపులు చూడకుండా.. వారి వద్దకే రేషన్ ను కూడా పంపేందుకు ఉద్దేశించిన పథకమే “ ఇంటింటికీ రేషన్ “ పథకం.
ఆ రేషన్ డోర్ డెలివరీ వాహనాల దగ్గర జనాలు క్యూ కట్టే ఛాన్సే లేదు.. ఎందుకంటే ఈ వాహనాలు నెలలో సగటున 18 రోజులు లబ్ధిదారులకు రేషను అందించాలి. ప్రతి రోజూ సగటున 90 కార్డులకు తగ్గకుండా రేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకరోజో రెండు రోజులో వాహనం వచ్చి వెళ్ళిపోతుంటే జనాలు క్యూ కట్టాలి.. ఇక్కడ 18 రోజులు ఆ కాలనీలోనే రేషన్ వాహనం కనబడుతుంటే ప్రజలు ఎందుకు క్యూ కడతారు. రేషన్ డోర్ డెలివరీ విధానం గురించి నారా లోకేష్ మాట్లాడేదంతా సోది వాగుడే.
రేషన్ డోర్ డెలివరీ పథకం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ చేసిన గోల, ఎల్లో మీడియా హడావిడి అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్కరూ సైంటిస్టులు అయిపోయి ఇంటింటికీ రేషన్ డోర్ డెలివరీ చేస్తే అంత వృధా.. ఇంత వృధా అంటూ గగ్గోలు పెట్టారు.. అయినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెనక్కి తగ్గలేదు. ఈ పథకం కారణంగా నాణ్యమైన, మెరుగుపరచిన బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటివద్దే అందచేసేందుకు ఏటా రూ.830 కోట్లు అదనంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఖజానా నుండి ఖర్చవుతున్నా ప్రజలకిచ్చిన మాట కోసం అమలు చేస్తూనే ఉన్నారు.
కానీ ఈ లోకేష్ కి తెలియని విషయం ఏంటంటే 2 రూపాయల కిలో బియ్యాన్ని ప్రజల వద్దకే పంపుతానంటూ, అందుకోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్టు చంద్రబాబు నవంబర్ 18, 1995 లోనే చెప్పాడు. ఇప్పుడు అదే రకమైన విధానంలో కదా వైఎస్సార్సీపీ “ ఇంటింటికీ రేషన్ “ పథకాన్ని అమలు చేస్తున్నది. అప్పట్లో చంద్రబాబు ఇంటికి పంపుతానన్నాడు, ఇప్పుడు రేషన్ బండి ఇళ్ళ వద్దకు వెళ్ళి ఇస్తుంది. ఇప్పుడు ఈ విధానం తప్పు అంటే అప్పుడు చంద్రబాబు ఆలోచనకూడా తప్పే కదా.. అయినా లోకేష్ కి అంత జ్ఞానమే ఉంటే.. ముందే తండ్రి చేసిన రాజకీయాల గురించి తెలుసుకోని రోడ్డెక్కెవాడు.
ఓహ్.. ఇక్కడ రేషన్ బండికయ్యే ఖర్చే సమస్యైతే.. అప్పుడు చంద్రబాబు ప్రతి ఒక్కరి ఇంటికీ బియ్యపు మూట నెత్తిన పెట్టుకోని వెళ్ళి ఇచ్చోచ్చే ప్రణాళిక చేసాడా.. ??? నారా లోకేష్ కి ముందు వెనకా తెలియదు.. దేని మీద అవగాహన ఉండదు.. అరకొర తెలివితేటలతో ప్రజలను విసిగిస్తుంటాడు.