ఎన్నికల నేపథ్యంలో అనేక సర్వే సంస్థలు ఏపీలో సర్వేలు చేస్తూ వాటిని రిలీజ్ చేస్తూ వున్నారు. అలా జాతీయ సర్వే సంస్థ చాణక్య సర్వే ఓనర్ పార్థ దాస్ వెస్ట్ గోదావరి సర్వే చేసి వాటి తాలూకు వివరాలను నిన్న తన ఎక్స్ ద్వారా పంచుకున్నారు. వెస్ట్ గోదావరిలో మహిళల్లో వైఎస్సార్సీపీ కి తిరుగులేని ఆధరణ ఉన్నదని అలాగే పురుషుల్లో కూటమికి ఆధరణ వున్నది అని ప్రకటించారు. చాణక్య సర్వే వెస్ట్ గోదావరి జిల్లాలో మొత్తం సేకరించిన శాంపిల్ సైజ్ – 2121 అందులో పురుషులు – 1568, మహిళలు – 550. వీళ్ళలో వైఎస్సార్సీపీ కి 47.4% , కూటమికి 47.3% , కాంగ్రస్ కు 4.2% , స్వతంత్రులకు 0.9% ఓట్ల శాతం దక్కవచ్చు అని తెలిపారు. ఇందులో పురుషుల్లో వైఎస్సార్సీపీ కి 44.2% , కూటమికి 50.1%, కాంగ్రెస్ కు 4.7%, స్వతంత్రులకు 1.1% ఓట్ల శాతం దక్కుతాయి అని తమ సర్వేలో తేలింది అని ప్రకటించారు.
ఇక కీలకమైన మహిళల్లో తీసుకున్న శాంపిల్ తక్కువ అయినా వారిలో అత్యధికంగా వైఎస్సార్సీపీ కి 56.9%, కూటమికి 39.6% , కాంగ్రెస్ కు 2.9%, స్వతంత్రులకు 0.5% ఓట్ల శాతంతో తమ సర్వేలో పాల్గొన్న మహిళల మద్దతు ఆయా పార్టీలకు తెలిపారు అని ప్రకటించారు. సీట్ల పరంగా చూసుకుంటే ఆశ్చర్యకరమైన రీతిలో కూటమికి 8 , వైఎస్సార్సీపీ కి 6 , ఇంకోక సీటు లో ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ వుంది అని ప్రకటించారు. అలాగే ఉండి నియోజవర్గం లో స్వతంత్రులకు 8% దాటి ఓటింగ్ రావచ్చు, చింతలపూడి నియోజకవర్గం లో కాంగ్రెస్ కు 8% ఓటింగ్ దాటవచ్చు అని చెప్పారు. ఇది ఎవరి ఓటింగ్ కు దెబ్బ తీస్తుందో అని చూడాలి అని తెలిపారు.
ఈ సర్వే మాత్రం వైఎస్సార్సీపీలో జోష్ నింపింది, ఇది ఈరోజు వరకు వున్న పరిస్థితులు మాత్రమే జగన్ బస్సు యాత్ర మరియు వైఎస్సార్సీపీ మ్యానిఫెస్టో రిలీజ్ చేసిన తరువాత డబుల్ సంఖ్యలో సీట్లు సాధిస్తము అని వైఎస్సార్సీపీ నాయకులు ధీమాగా చెబుతున్నారు. అటూ కూటమి చూసుకుంటే రోజు రోజు కీ టికెట్ల సమస్యలు ముదిరిపోతున్నాయి. దాదాపు సగం నియోజకవర్గాల్లో రెబల్స్ పోటి లో వుండే అవకాశం ఉంది ఇది కూటమి గెలుపు అవకాశాలను దెబ్బ తీసేలా వున్నాయి. ఇక కాంగ్రెస్ కు డిపాజిట్లు వచ్చే అవకాశాలు కూడా లేవు. ఉండి నియోజకవర్గం లో మాత్రం ప్రధాన పార్టీల తో పాటు స్వతంత్ర అభ్యర్థికి సమానంగా పోటీలో గెలుపు అవకాశాలు ఉన్నాయి.