ఐఎంజీ అని అమెరికా కి చెందిన ఓ పెద్ద స్పోర్ట్స్ అండ్ కల్చర్ కంపెనీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాని కార్యకలాపాలు ఉన్నాయి. ఓ మల్టీ నేషనల్ కంపెనీ అన్నమాట… బాగా పేరున్నది కూడా. ఇప్పుడు ఈ భాగోతం అంతా ఎందుకు అంటారా…..
2003 లో ఐఎంజీ భారత్ పేరుతో ఓ కంపెనీ స్థాపించబడింది. అచ్చం అమెరికాకి చెందిన ఐఎంజీ లా, భారత్ లో దాని బ్రాంచ్ లా అనిపించేలా.. అది నెలకొల్పబడిన తేదీ 2003 ఆగస్ట్ 5. ఈ కంపెనీతో 2003 ఆగస్ట్ 8 న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఓ ఎంవోయూ చేసుకుంది.. అంటే కంపెనీ పెట్టిన 3 రోజులకే ప్రభుత్వంతో ఒప్పందం అన్నమాట. దానిదేం ఉంది ప్రపంచవ్యాప్తంగా పేరు మోసిన సంస్థ కదా, మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడం మంచిదేగా అనుకోవచ్చు.. ఆగండి ఆగండి అక్కడే బాబు జిమ్ముక్కు ఉంది. ఈ సదరు ఐఎంజీ భారత్ కు అమెరికాకు చెందిన పేరుమోసిన ఐఎంజీ కి ఎలాంటి సంబంధం లేదు.. ఈ ఐఎంజీ భారత్ కంపెనీ ఓనర్ చిత్తూరు కు చెందిన అహోబిల నాయుడు అలియాస్ బిల్లీ రావ్ బాబుకు అత్యంత సన్నిహితుడు.
కంపెనీ పెట్టిన నాలుగో రోజుకే ఎంవోయూ చేసుకోడం పెద్ద విషయం కాదు, 2003 నవంబర్ 14 నాటికి చంద్రబాబు ప్రభుత్వం రద్దు కాగా బాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ ఐఎంజీ భారత్ అనే కంపెనీ కి గచ్చిబౌలి లో 400 ఎకరాలు, అక్షరాలా 400 ఎకరాలు, సరూర్ నగర్ లో 450 ఎకరాలు, అక్షరాలా నాలుగొందల యాభై ఎకరాలు కేవలం రెండు కోట్లకే కట్టబెట్టేందుకు సేల్ డీడ్ కూడా చేశాడు బాబు… అంటే మొత్తంగా హైదరాబాద్ లో 850 ఎకరాలు అదీ చాలదన్నట్టు ఆఫీస్ కొరకై జూబ్లీహిల్స్ లో 5 ఎకరాలు ఇస్తా అని కూడా మాటిచ్చాడు..
ఇది చదివితే నారా దేవాన్ష్ కి కూడా ఇదో పెద్ద అవినీతి అని తెలిసిపోతుంది. అప్పటికప్పుడు పెట్టిన కంపెనీ, 3 రోజుల్లో ఎంవోయూ, ఆపద్ధర్మ ముఖ్యంత్రిగా సేల్ డీడ్, ఏకంగా 850 ఎకరాలు, అదికూడా హైదరాబాద్ లో.. దీనికి మించిన దారుణమైన అవినీతి ఎక్కడైనా ఉంటుందా?
అందుకే 2007 లో ఈ ఐఎంజీ భారత్ కి కేటాయించిన వందల ఎకరాలను రద్దు చేస్తూ వైయస్సార్ ప్రభుత్వం చట్టం చేసింది. దీనిపై సదరు కంపెనీ వారు కోర్ట్ కు వెళ్లగా, 18 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత నిన్న హై కోర్టు వైయస్సార్ చేసిన చట్టాన్ని, ఐఎంజీ భారత్ కు కేటాయించిన భూములను రద్దు చేయడాన్ని సమర్థించింది.. ఆ చట్టాన్ని పునరుద్ధరించాలని, ఆ కంపెనీ కి అసలు ఎటువంటి మెరిట్ లేదని, 850 ఎకరాలు కేటాయించే అంత పెద్ద కంపెనీ కాదని, దానికి ఏ అంతర్జాతీయ కంపెనీతో గానీ, ఏ స్పోర్ట్స్ నిర్వహించిన చరిత్ర, అనుభవమూ లేదని కోర్టు విచారణలో తేలింది అని సీజే తో కూడిన ధర్మాసనం తీర్పించింది…
ఇలా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూమిని తన బినామీల పేరు మీద తేరగా కొట్టేసి రెండెకరాల ఆస్థి నుండి లక్షల కోట్లు సంపాదించేంత ఎదిగిన బాబు తాను నిప్పని, ఎదుటివారి పై ఏ అధారమూ లేకుండా అవినీతిపరుడు అని ముద్ర వేస్తూ తన భజన మీడియా ద్వారా వ్యక్తిత్వ హననం చేస్తూ ఉంటాడు.. ఇంత పెద్ద నేరం చేసినా బాబు పై ఎలాంటి విచారణ ఉండదు, టీవీ డిబేట్ లు కూడా ఉండవు..