ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో నేడు నెలలో మొదటిరోజు పెన్షన్ల పండగ జరుగుతుంది.. ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వంలో పెన్షన్ పొందాలంటే జన్మభూమి కమిటీల చుట్టూ ప్రజలు కాళ్ళు అరిగేలా తిరగాల్సి వచ్చేది.. తిరగడమే కాకుండా పెన్షన్ అందుకునే ఒకరు చనిపోతే కానీ కొత్తవారికి పెన్షన్ మంజూరు చెయ్యమూ అనే మాటలు పడాల్సి వచ్చేది. చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలో ప్రజలకు అన్ని విధాలుగా వంచనే జరిగింది.
1995 లో ముఖ్యమంత్రి గా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పటి నుండి పెన్షన్ అరకొరగా అమలయ్యింది. తరువాత దివంగతనేత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక అప్పట్లో రూ.75గా ఉండే పింఛన్‌ను 2006 ఏప్రిల్ 1వ తేదీ నుంచి రూ.200కు పెంచారు. 2008లో ఒకే ఏడాదిలో ఏకంగా 23 లక్షల మంది అవ్వాతాతలు, వితంతువులకు కొత్తగా పింఛన్లు మంజూరు చేశారు. అప్పట్లో ఇదే విషయాన్ని కాగ్ రిపోర్టు సైతం పేర్కొంది.
తరువాత 2014 లో టీడీపీ హయాంలో పింఛను రూ. 1000 గా ఉండింది. అయితే ఎన్నికలకు నెలల ముందు దీనిని రూ. 2000 కు పెంచింది బాబు ప్రభుత్వం. 2019 ఎన్నికలకు వైఎస్ జగన్ హామీలను కాపీ కొట్టి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.
2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపొందిన అనంతరం పింఛనును రూ. 2,250 కి పెంచింది. మే 30, 2019 న ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్ అవ్వతాతల పెన్షన్ పెంపుదల ఫైల్ పై మొదటి సంతంకం చేశారు. వైఎస్ జగన్ జూలై 1, 2019 న రాష్ట్రవ్యాప్తంగా పెంచిన పెన్షన్ ను అమలుచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట ఇచ్చిన ప్రకారమే ప్రతి ఏడాది రూ.250 లు పెంచుకుంటూ పోతున్నారు. ప్రస్థుతం 2024 లో ప్రభుత్వంలో రూ. 3వేల చొప్పున 66.34 లక్షల మందికి పెన్షన్ అందుతుంది. పెన్షన్లపై ఏటా చేయనున్న వ్యయం రూ.23,556 కోట్లు. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు పెన్షన్ల ద్వారా అందించిన మొత్తం లబ్ధి అక్షరాల రూ. 83,526 కోట్ల పైమాటే.