ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వై యస్ వివేకానంద రెడ్డి మరణ ఉదంతాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకొని తద్వారా కడప ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నా షర్మిలకు మద్దతుగా మాట్లాడుతున్న సునీతకు సమాధానం చెప్తూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టారు.
షర్మిల, వైయస్ సునీత మధ్య తరచుగా ఎప్పుడు చూసినా వైయస్ వివేకానంద రెడ్డిని హత్య చేసింది అవినాష్ రెడ్డి, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి అంటూ సభలో చెప్తూ వస్తున్నారు. సునీత అయితే ఏకంగా ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగ తరచూ ప్రెస్ మీట్లు పెడుతూ వాళ్లకు అనుకూలంగా, అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నారు. ఎవరైనా జర్నలిస్టులు సునీతను ప్రశ్నస్తే ఆమెకి అనుకూలంగా ఉంటే మాట్లాడుతుంది, లేకపోతే నాకు తెలీదు అని దాట వేస్తుంది. నిన్న ఒక జర్నలిస్ట్ వివేకానంద రెడ్డి రెండో భార్యా గురుంచి , వాళ్ళకి పుట్టిన బాబు గురుంచి అడగగా నాకు తెలీదని చెప్పింది. కానీ 2019లో సీబీఐకి ఇచ్చిన స్టేట్మెంట్ లో వివేకా అక్రమ సంబంధం గురుంచి పూర్తి వివరాలు తెలియజేసింది. కానీ ఇప్పుడు మాత్రం నాకు తెలీదు అంటూ జవాబు దాటవేసింది. ఇలా సునీత ద్వంద వైఖరి ప్రదరిస్తోందని ప్రజలందరికి అర్థమవుతోంది.
దీనిపై ఇవాళ అవినాష్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ వివేకా హంతకుడు దస్తగిరిని అప్రూవర్ గా మార్చి ఆయనతో కుమ్మక్కై సునీత ఎన్నికల వేళ తనపై రాజకీయంగా బురదజల్లుతున్నారని అవినాష్ ఆరోపించారు. వివేకాను హత్య చేసినట్లు దస్తగిరి అంగీకరించినా ఆయన్ను సాక్షిగా మార్చేందుకు సునీత ఒప్పందం చేసుకొని అప్రూవర్ గా మార్చి సునీతకు ఎలా కావాలి అంటే ఆలా స్టేట్మెంట్లు ఇప్పించుకుందని మండిపడ్డారు . హత్య చేశానని ఒప్పుకున్న వాడిని అప్రూవర్ గ మార్చడం ఏంటని గతంలో వివేకా హత్యపై సీబీఐ దగ్గర వాంగ్మూలం ఇచ్చిన సునీతారెడ్డి, ఆ తర్వాత వివేకా రాసిన లెటర్ గురించి తనకు తెలియదని తప్పించుకున్నట్లు అవినాష్ రెడ్డి ఆరోపించారు. వివేకాను చివరి రోజుల్లో సునీత దుర్భర పరిస్దితుల్లోకి నెట్టారని, చివరికి చెక్ పవర్ కూడా రద్దు చేశారని అవినాష్ రెడ్డి మీడియాతో తెలిపారు. వివేకా ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటమికి కారణమైన బీటెక్ రవితో జత కట్టి తనపైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని, తన ఎంపీ అభ్యర్థిత్వం పైన అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి వాటిని నమ్మాల్సిన పని లేదని ఎన్నికలో నేనే పోటీ చేస్తున్నానని అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు.