ప్రపంచంలో ఏం జరిగినా తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి ఖాతాలో వేయడం ఎల్లో గ్యాంగ్‌కు అలవాటు. ఈ 40 ఇయర్స్ ఇండస్ట్రి ఏమీ చేయలేదు కాబట్టే ప్రతిదీ ఆయన వల్లే జరిగిందని ప్రజల్ని నమ్మించే యత్నం చేస్తుంటారు. ఒకప్పుడంటే సోషల్ మీడియా లేదు కాబట్టి పచ్చ పత్రికలు ఏ రాసినా ఓ సామాజికవర్గం నమ్మేసి ఇతరుల వద్ద బిల్డప్ ఇచ్చేది. కాకపోతే ఇప్పటికీ అదే భ్రమల్లో బతుకుతోంది. జనంలోకి వెళ్లి ఆ పాత కథల్ని చెప్పడంతోనే సరిపెట్టుకోదు. వాదనకు కూడా దిగుతుంది. కానీ కాలం మారిపోయింది. అప్పట్లోలా అన్నీ ఆయన వల్లేనంటే జనం సీటు కింద తన్నే పరిస్థితులు వచ్చాయి. అయినా కొందరు తెలుగు తమ్ముళ్ల తీరు మారదు. శనివారం బాబు పుట్టినరోజు ఈ సందర్భంగా విషెస్ చెబుతూ పెట్టిన పోస్టును చూసి ప్రజలు ఔరా అనుకుంటున్నారు. ఎవరో చేసిన పనులకు నారా వారికి క్రెడిట్ ఇవ్వాలని చూసి అభాసుపాలయ్యారు.
దేశంలో ఐటీ రావడానికి నేనే కారణమని బాబు ప్రతి మీటింగ్‌లో నొక్కి మరీ చెబుతుంటారు. వారిని ప్రధాని చేసింది నేనే.. వీరిని రాష్ట్రపతిని చేసింది నేనేనని తడుముకోకుండా అబద్ధం చెప్పేస్తారు. జనం మెదళ్లలోకి విషం ఎక్కించడంలో ఈనాడు దిట్ట కదా.. అదే నిజమని నమ్మించింది. తమ్ముళ్లేమో హైదరాబాద్‌లోని సైబర్ టవర్స్‌ను బాబు ఖాతాలో వేసేశారు. వాటికి శంకుస్థాపన చేసింది ఒకప్పటి సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డి. అంతా ఆయన హయాంలోనే జరిగింది. అన్నా క్యాంటీన్ బొమ్మ పెట్టారు. అవి ఏర్పాటు చేసింది 2019 ఎన్నికలకు ముందు. ఇంకా చెప్పాలంటే క్యాంటీన్ల నిర్మాణం పేరుతో వందల కోట్ల రూపాయలు దోచింది నిజం. అపోలో టైర్స్ మొదలైంది 2020లో.. 2014కి ముందే కోకకోలా ప్లాంట్ ఏపీలో ఉంది. క్యాడ్బరీ 2013లోనే ఎంఓయూ చేసుకుంది. రింగ్‌రోడ్డుకు, శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు కారణం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి. ఇంకా చాలా వాటికి కారణమని బాబేనని చెప్పడాన్ని బట్టి చూస్తే అన్నింటికీ నేనే జబ్బు పరాకాష్టకు చేరినట్లుంది.
అసలు ఏమీ చేయకుండానే సంపద సృష్టించా.. పరిశ్రమలు తెచ్చా.. ఉద్యోగాలు కల్పించా.. అంటూ బాబు కట్టుకథలు చెబుతూ ఉంటారు. వాటిని ఓ సామాజికవర్గం గుడ్డిగా నమ్మి ప్రచారం చేస్తూ ఉంటుంది. ‘సూర్యుడి చుట్టూ తిరగమని భూమికి చెప్పింది ఎవరో కాదు.. మన బాబే’, ‘ఆడమ్ అండ్ ఈవ్ సృష్టికర్త మన విజనరీనే’, ‘నిప్పు కనిపెట్టి నిప్పులా బతికింది ఆయనే’, ‘పంటలు పండించడం మొదలుపెట్టింది బాబే’, ‘దక్షిణాఫ్రికాలో ఉన్న మహాత్మా గాంధీజీని ఇండియాకు పిలిపించి నారా వారే’, రెండో ప్రపంచ యుద్ధాన్ని ఆపింది చంద్రబాబే’, నువ్వు ప్రధాని అయితే దేశం బాగుపడుతుందని నరేంద్రమోదీకి చెప్పింది ఎవరో కాదు. సాక్షాత్తు బాబు గారే’, ‘కరోనా అంతం చూసింది ఆయనే’, పచ్చగ్యాంగ్ భవిష్యత్‌లో ఇలా చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే నమ్మే వెర్రిపుష్పాలు ఉన్నంత కాలం వాళ్లు ఇలాగే చెబుతూ ఉంటారు. అసలు బాబు పేరు గుర్తు వచ్చేవి వేరేవి ఉన్నాయి. ‘అవినీతికి కేరాఫ్. అమరావతి పేరుతో వేల కోట్ల రూపాయలు దోచింది బాబే. దేశంలో ఈయనలా ఎవరూ పార్టీలతో జత కట్టలేదు. విడిపోలేదు. ఇతర పార్టీల్లోని ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో దిట్ట. అధికారం కోసం ప్రత్యర్థులను అంతమొందించాలని చూస్తారు. పవన్ కళ్యాణ్‌ను ఆడిస్తున్న వ్యక్తి. మోదీని తిట్టి మళ్లీ ఆయన చంకనెక్కిన మేధావి’ తదితరాలు. సో అదన్నమాట సంగతి.