భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకోవడంతో చంద్రబాబు నాయుడికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. నియోజకవర్గాల్లో ముస్లింలు, దళితులు టీడీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారురు. దీంతో వారు ఓటు వేయరని ఆందోళన వారు చెందుతున్నారు. ఆ వర్గాన్ని మచ్చిక చేసుకోవాలని ఇప్పటికే ఆదేశాలిచ్చారు. వాళ్లు అదే పనిలో ఉన్నారు. ఇంకా వైఎస్సార్ కాంగ్రెస్‌లోని ముస్లిం నేతలను ప్రలోభాలకు గురి చేసి తన పార్టీలో చేర్చుకోవాలని చూస్తున్నారు. ఎన్డీఏలో చేరినా ముస్లింలు తమకు మద్దతు ఇస్తున్నారని చూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా మహమ్మద్ ఇక్బాల్ చేరిక జరిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాపడుతున్నారు.
మహ్మద్ ఇక్బాల్ మాజీ పోలీస్ అధికారి. చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేశారు. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరారు. ముస్లింలకు మొదటి అండగా ఉన్న జగన్మోహన్రెడ్డి ఆయన్ను రెండుసార్లు ఎమ్మెల్సీని చేశారు. 2019లో హిందూపురం అసెంబ్లీ నుంచి ఇక్బాల్ పోటీ పోటీ చేసి ఓడిపోయారు. అయినా ప్రాధాన్యం తగ్గించలేదు. బాగా చూసుకున్నారు. 2024లో ఆయన టికెట్ ఆశించారు. అయితే ఈసారి జగన్ అక్కడ బీసీ మహిళ అయిన దీపికకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇక్బాల్ అలకబూనారు.
అంసతృప్తిగా ఉన్న ఇక్బాల్‌తో చంద్రబాబు బేరం పెట్టారు. ముస్లింల ఓట్ల కోసం పెద్దమొత్తంలో డబ్బుతో ఎర వేశారు. కండువా కప్పుకొనేందుకు రూ.10 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. ఇక ఎలాగూ పోటీ చేసేందుకు అవకాశాలు లేవు. బాబు చెప్పినట్లు వింటే డబ్బు వస్తుందని ఇక్బాల్ భావించారు. రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పిన పార్టీతో అంటకాగుతున్న పార్టీ అధినేత చేత కండువా కప్పించుకుని సొంత వర్గాన్ని ఇక్బాల్ మోసం చేశారని విమర్శలు వస్తున్నాయి. నియోజకవర్గాల్లోనూ టీడీపీ నేతలు ఇతర పార్టీలోని ముస్లిం నేతలను చేర్చుకునేందుకు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేస్తున్నారు.