కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గత 30 సంవత్సరాలుగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రధాన ప్రతి పక్షనాయకుడిగా వున్నారనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ ఈ ముప్పై సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు కుప్పంకు కృష్ణ నీళ్లు తీసుకురాలేకపోయారు. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన మొదటి విడతలోనే కుప్పంకు కృష్ణ నీళ్లు కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా తీసుకువచ్చి, కుప్పం నియోజకవర్గం మీద అక్కడి ప్రజల మీద తనకున్న ప్రత్యేక ప్రేమను తెలియజేసారు.. అయితే పనులు పూర్తి కాకుండా నీళ్లు ఇచ్చారని, చంద్రబాబు ఈనాడు రామోజీరావు ఒకటే ఊదరగొడుతుంటే ఎక్కడ కుప్పం బ్రాంచ్ పనులు పూర్తి కాలేదో మీ ఇంజనీరింగ్ విభాగంతో ప్రూవ్ చెయ్యమని వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కుప్పం వైసీపీ ఇంచార్జ్ భరత్ విసిరిన ఛాలెంజ్ కు జవాబు ఇవ్వలేక చంద్రబాబు నాయుడు, ఈనాడు రామోజీరావు తోక ముడిచారు.
గతంలో కుప్పంకు నీళ్లు తీసుకువస్తా అనే పేరుతో చంద్రబాబు నాయుడు తన కుడి భుజం అయిన సిఎం రమేష్ కు పనులు అప్పగించి కోట్లకు కోట్లు దోచుకున్నారు తప్ప పనులు చేసింది లేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అవ్వగానే పాత టెండర్ లను రద్దు చేసి మళ్ళీ రిటెండర్ కు వెళ్ళి తక్కువ కోట్ చేసిన కంపెనీ కు పనులు అప్పగించారు. కరోనా కష్టకాలంలో కూడా పనులు పూర్తి చేస్తూ వచ్చారు. చివరకు 2023 డిసెంబర్ నెలలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి అయ్యాయి. కుప్పం బ్రాంచ్ కెనాల్ కు కృష్ణ నీళ్లు వదిలి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గారి చేతుల మీదగా కుప్పంలో మూడు చెరువుల నింపారు. 2024 లో వున్న వర్షాభావ పరిస్థితుల వలన అనంతపురం జిల్లాకు త్రాగు నీరు అవసరాలకి నీటి నీ నిల్వ వుంచడం కోసం కుప్పంలో మూడు చెరువులకు మాత్రమే నీళ్లు ఇవ్వడం సాధ్యపడింది. వచ్చే వర్షా కాలంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా మొత్తం అయకట్టుకు , చెరువులకు నీళ్లు అందిస్తాం అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి , కుప్పం వైసీపీ అభ్యర్థి భరత్ అధ్వర్యంలో హాజరయిన వేల మంది కుప్పం ప్రజల సాక్షిగా వెల్లడించారు.
అయితే ఈనాడు రామోజీరావు తన దినపత్రిక లో కుప్పం కెనాల్ పూర్తి కాలేదని రాతలు వ్రాస్తుంటే, చంద్ర బాబు నాయుడు కుప్పం పర్యటనకు వచ్చి కుప్పం బ్రాంచ్ కెనాల్ కు ఎక్కడ పూర్తీ చేశారు ఎక్కడ నీళ్లు ఇచ్చారని మాట్లాడుతుంటే, వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కుప్పం నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీ భరత్ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు, ఈనాడు రామోజీరావు కు ఓక ఛాలెంజ్ విసిరారు. మీకు నచ్చిన తెలిసినా ఇంజినీరింగ్ అధికారులతో కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి కాలేదు అని ప్రూవ్ చెయ్యండి అని సవాల్ విసిరితే ఈరోజు వరకు ఈనాడు రామోజీరావు, చంద్రబాబు నుండి జవాబు లేదు. ఇప్పుడు కుప్పంలో నీళ్లు అందించిన వైసీపీ పార్టీ కి ప్రజల్లో విపరీతమైన ఆదరణ పెరిగింది. ఈ ఎలక్షన్ లో చంద్రబాబు గెలుపు కష్టమే అని కుప్పం ప్రజలు చెబుతున్నారు. తమకు సంక్షేమం, సామాజిక న్యాయం, కృష్ణ నీళ్లు ఇచ్చి , తాము పిలిస్తే పలికే దూరంలో వుండే భరత్ ను గెలిపించుకుంటాము అని కుప్పం ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.