ఏపీ రాజధానిగా విశాఖ అవుతున్న వేళ ఈ ఎలక్షన్ లో ఏ పార్టీ కి విశాఖ ప్రజలు అండగా వుండబోతున్నారో అని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. 2019 లో విశాఖలో నాలుగుకి నాలుగు సీట్లు టీడీపీ కైవసం చేసుకుంది. 2014 లో కూడా కూటమి అభ్యర్థులే విజయం సాధించారు. అధికార వైసీపీ పార్టీకి గత రెండు ఎన్నికల్లో నిరాశపూరిత ఫలితాలే వచ్చాయి. టీడీపీకి మాత్రం గత రెండు ఎన్నికల్లో విశాఖ ప్రజలు అండగా నిలిచారు. అయితే గత కార్పొరేషన్ ఎలక్షన్ లో మాత్రం అధికార పార్టీ వైసీపీ గెలుచుకొని సత్తా చాటింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విశాఖ ను రాజధానిగా ప్రకటించిన తరువాత విశాఖను అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు. ముఖ్యంగా రోడ్లు, బీచ్, సుందరీకరణకు వందల కోట్లు ఖర్చు చేశారు. ప్రభుత్వ పరంగా హాస్పిటల్స్, నాడు నేడు పేరుతో స్కూల్స్ చాలా బాగా అభివృద్ది చేశారు.
ఇక కోవిడ్ టైంలో ప్రభుత్వ అధికారులతో పాటు వాలంటీర్లను సమన్వయం చేసుకుంటూ వైసీపీ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతి సందర్భంలో విశాఖను రాజధానిగా ప్రమోట్ చేస్తూ వచ్చారు. జీఐఎస్ సమ్మిట్ తో దేశంలో ప్రముఖ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించి విశాఖను దేశానికి ఏపీ రాజధానిగా పరిచయం చేశారు.ఆ తరవాత జీ 20 సదస్సు కూడా నిర్వహించారు. అదే టైంలో టీడీపీ 2019 ఎన్నికల తరువాత ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో వైసీపీ నాయకులు ప్రజలకు అందుబాటులో వుండటంతో టీడీపీకి ఈసారి అంతా సానుకూలంగా లేదు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో విశాఖ ఉత్తరం నుండి వైసీపీ నుండి కె కె రాజు, బిజెపి నుండి విష్ణు కుమార్ రాజు పోటి చేస్తున్నరు. కె కె రాజు 2019 లో అతి తక్కువ మెజారిటీ తో ఓడిపోయారు. అప్పటి నుండి ప్రతి రోజూ ప్రజల మధ్యనే గడిపారు, ఇక విష్ణు కుమార్ రాజు ప్రజలతో సంబందం లేకుండా ఎలక్షన్ టైం కు చంద్రబాబుతో వున్న పరిచయాలతో టికెట్ సంపాదించారు. ఇద్దరి మధ్య గట్టి పోటి వుంటుంది కానీ వైసీపీ వైపు మొగ్గుచూపుతున్నారు ప్రజలు.
విశాఖ దక్షిణం నుండి వైసీపీ నుండి వాసుపల్లి గణేష్ పోటీలో వున్నారు, కూటమి నుండి జన సేన తరుపున వంశీ కృష్ణ యాదవ్ పోటి లో వున్నారు. వైసీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు మత్స్య కారులకు అండగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాజిటివ్ ఓటు కీలకంగా వున్నాయి, అలాగే ఇక్కడ వున్న సామాజిక పరిస్థితులు, అభ్యర్ధుల బలాబలాలు దృష్ట్యా వాసుపల్లి గణేష్ కు గెలుపు అవకాశాలు మెరుగ్గా వున్నాయి.
విశాఖ తూర్పు ఇక్కడ టీడీపీ తరుపున వెలగపూడి రామకృష్ణ గత రెండు సార్లు భారీ మెజార్టీ తో గెలుపొందారు, కాకుంటే 2014 తో పోల్చుకుంటే 2019లో కొద్దిగా మెజారిటీ తగ్గింది. ఇప్పుడు ఇక్కడ వైసీపీ తరుపున ప్రస్తుత విశాఖ ఎంపీ సత్యనారాయణ పోటి చేస్తున్నారు, ఇద్దరు ఒకటే సామజిక వర్గానికి చెందిన వారు అవ్వడం వెలగపూడి రామకృష్ణ గత రెండు సార్లు గెలిచిన అభివృద్ది జరగకపోవడం ప్రధాన నెగటివ్, ప్రజల్లో వున్న పరిచయాలతో గెలుస్తా అనే ధీమాతో ఉన్నారు, ఇక వైసీపీ అభ్యర్థి విశాఖ ఎంపీ సత్యనారాయణ గారు అర్ధ బలం వున్న నాయకులు , ఇక్కడ ఇద్దరి మధ్య హోరాహోరీగా పోరు వుండబోతుంది.
విశాఖ పశ్చిమలో టీడీపీ తరుపున గణబాబు గారు గత రెండు సార్లు భారీ మెజార్టీ తో విజయం సాధించారు. ఇప్పుడు ఇక్కడ వైసీపీ తరుపున విశాఖ డెయిరీ చైర్మన్ అడారి అనంద్ పోటి చేస్తున్నరు. ఇద్దరూ గవర సామజిక వర్గానికి చెందిన వారు. ఈసారి గవర సామజిక వర్గాలు అడారి అనంద్ కు సపోర్ట్ చేస్తున్నారు .ఇక్కడ వైసీపీ విజయం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.