గురువింద గింజ తన కింద నలుపు ఎరగదు అన్నట్టు చంద్రబాబు, రామోజీ తాము చేస్తున్న అక్రమాలు అన్యాయాలు అరాచకాలు మచ్చుకు కూడా గుర్తుంచుకోరు. ఒకవేళ గుర్తున్నా వాటిని అస్సలు పట్టించుకోరు. పైగా తమకున్న ఎల్లో మాఫియా అండతో మసిపూసి మారేడు కాయ చేస్తారు. పొరపాటున ఎవరైనా వాటిని గుర్తించి ఎదురు తిరిగితే అవతలి వాళ్ళ ఆచూకీ లేకుండా చేస్తారు అనేది జగమెరిగిన సత్యమే.. ఎందుకు అంటే రామోజీ అనుభవిస్తున్న సంపదంతా జీ.జే రెడ్డిగారిది అయితే… బాబు అనుభవిస్తున్న టీడీపీ ఎన్టీఆర్ స్దాపించినది అని మనకందరికీ తెలిసిందే.
బహుశా మీకు గుర్తుండే ఉంటుంది కొన్నాళ్ల క్రితం తెలుగు సినీ చరిత్రలో విలక్షణ నటుడుగా పేరుగాంచిన నూతన ప్రసాద్ గారితో రామోజీరావు తన ఈటీవీ ఛానల్ లో ప్రపంచంలో జరిగే అనేక ఘోరాలను నేరాలను అన్యాయాలను అరాచకాలను అక్రమాలను అణచివేతలను కళ్ళకు కట్టినట్లుగా చూపించేవాడు. నూతన ప్రసాద్ గారి గొంతులో సహజత్వం ఉట్టిపడేలా, అక్కడ జరుగుతున్నది పాత్రధారుల నటన అని మనకు తెలిసినా నిజమేనేమో మన కళ్ళ ముందే జరుగుతుందేమో అనే భ్రమను కలిగించేలా వాస్తవికతను జోడించి వినిపిస్తూ ఎపిసోడ్లు ఎపిసోడ్లుగా మన కళ్ళ ముందు ఆవిష్కరించేవాడు
అయితే అదేమి విచిత్రమోగానీ… లోకం లో జరిగిన అన్ని నేరాలను, ఘోరాలను కళ్ళకు కట్టినట్లుగా తన ఈటీవీలో చూపించిన రామోజీ… తాను జీ జే రెడ్డిని ఎలా మోసం చేసింది, ఆయన నుండి ఇన్ని ఆస్తుల్ని ఎలా దోచుకున్న సంగతిని ఈనాడు తన టీవీలో చూపించిన దాఖలాలు లేవు. రామోజీకి అత్యంత సన్నిహితుడు ఆప్తుడు అణుంగు శిష్యుడు అయిన చంద్రబాబు తనకు పిల్లనిచ్చిన సొంత మామ నుండి పార్టీని, పార్టీ గుర్తును, చివరికి పార్టీ ఫండ్ ను సైతం జయప్రదంగా ఎలా దోచుకున్న సంగతిని, మరి ముఖ్యంగా తాను మార్గదర్శి పేరిట వేల కోట్ల రూపాయలను ఎలా దోచుకున్న సంగతులను మాత్రం రామోజీ తన ఈటీవీలో ఎందుకు చూపించలేదో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని ప్రశ్నే… బహుశా తాను, చంద్రబాబు చేసినవి చిన్నపాటి నేరాలన్నదే రామోజీ ఉద్దేశ్యం కాబోలు!
పాపం రామోజీ చూపించని లోటుని ఉండవల్లి భర్తీ చేస్తున్నాడు.