ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డిజి సీతారామాంజనేయులు, విజయవాడ సిటీ క్రాంతి రాణాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వీరిద్దరిపై ఫిర్యాదులు ఆధారంగా ఎన్నికల సంఘం చర్యలు. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఫిర్యాదు మేరకు బదిలీలు చేసినట్లు సమాచారం. విజయవాడలో సిద్ధం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దాడి కారణం చేత కాంతి రాణాను బదిలీ చేసినట్లు సమాచారం.ఇద్దరు అధికారులకి ఎన్నికలలో సంబంధం లేని భాద్యతలు అప్పగించాలని ఈసీ ఉత్తర్వులలో పేర్కొంది, మీరు స్థానాలలో కొత్తవారిని నియమించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇద్దరి స్థానంలో కొత్త వారి నియామకం కోసం పేర్లని ఎన్నికల సంఘానికి ఇవ్వాల్సిందిగా కోరింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైయస్ జవహర్ రెండు స్థానాలకు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతిపాదించిన పేర్లు ఈ విధంగా ఉన్నాయి అంటూ సమాచారం. ఇంటెలిజెన్స్ చీఫ్ గా కుమార్ విశ్వజిత్, అఖిల్ సింగ్ పేర్లను ప ప్రతిపాదించినట్లు సమాచారం. విజయవాడ పోలీస్ కమిషనర్ గా పీహెచ్డీ రామకృష్ణ, త్రివిక్రమ్ వర్మ, వినీత్ బ్రిడ్జ్ లాల్ పేర్లను ప్రతిపాదిన చేసినట్లు సమాచారం. ఎన్నికల సంఘం ఈ రెండు పోస్టుల్లో ఎవరు నియమిస్తుందో చూడాలి. ఇప్పటివరకు ఎన్ని కల నోటిఫికేషన్ విడుదల జరిగిన తర్వాత 6 మంది ఐఏఎస్ అధికారులు, ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీలు చేసింది. ఎన్నికల నియమావళి పూర్తి అయ్యేలోపు మరి ఎంతమందిపై చూడాలి.