ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డిజి సీతారామాంజనేయులు, విజయవాడ సిటీ క్రాంతి రాణాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వీరిద్దరిపై ఫిర్యాదులు ఆధారంగా ఎన్నికల సంఘం చర్యలు. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఫిర్యాదు మేరకు బదిలీలు చేసినట్లు సమాచారం. విజయవాడలో సిద్ధం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి […]
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు మరికొద్దిరోజులే సమయం ఉంది. దీంతో ఎలక్షన్ కమిషన్ పనులను వేగవంతం చేసింది. జిల్లాల్లో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. నామినేషన్ల స్వీకరణ కోసం గదుల ఎంపిక, స్టాఫ్ నియామకం, పోలీస్ బందోబస్తు తదితర వ్యవహారాలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల్లో వసతులను కల్పిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని పార్టీల ప్రతినిధులతో గురువారం సచివాలయంలో వర్క్‌షాప్ నిర్వహించారు. లోక్‌సభ అభ్యర్థి రూ.95 లక్షలు, శాసనసభ అభ్యర్థి రూ.40 […]
2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేనకి ఒక కొత్త చిక్కు వచ్చి పడింది. పొత్తులో భాగంగా టీడీపీ – జనసేన కూటమిగా ఉండడం తెలిసిందే. అయితే జనసేన గుర్తు అయినా గాజు గ్లాస్ విషయంలో సంధిగ్తత నెలకొoది. కొన్ని నెలల క్రితం గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ గా చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే జనసేన పార్టీ అభ్యర్థన మేరకు ఈ సార్వత్రిక ఎన్నికలలో జనసేన అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించి […]
రాబోయే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీ లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బంది జాబితా తయారుచేయాలని, ప్రతి జిల్లాలో సిబ్బంది సంఖ్య ప్రాధమిక అంచనా కంటే 20% అదనంగా అధికాంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. ఎన్నికల సన్నద్ధతపై శుక్రవారం ఆయన వీడియో కాన్పరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎన్నికల సిబ్బంది నిర్వహణ, ఓటరు జాబితా తయారీ, ఓటరు గుర్తింపుకార్డుల […]
ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండు నెలలు మాత్రమే గడువుంది. ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులతో, తాము ఎన్నికలకు ‘సిద్ధం’గా ఉన్నామని అధికార వైసీపీ ఎన్నికలకు సమాయత్తమవుతుండగా, రా కదలిరా.. శంఖారావం అంటూ చంద్రబాబు లోకేష్ టీడీపీ శ్రేణులను ఉత్తేజితం చేస్తున్నారు. కాగా కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా ఇచ్చిన ఆదేశాలకు ప్రతిపక్ష పార్టీలు ఎలా స్పందిస్తాయో అన్న అనుమానం ప్రజల్లో కలగడం ఖాయంగా కనిపిస్తుంది. ఎన్నికల విధుల్లో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులను వినియోగించడానికి కేంద్ర […]
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ (ఎలక్షన్ కమిషన్) ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల బదిలీలు జోరుగా జరుగుతున్నాయి. శుక్రవారం 92 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. సొంత జిల్లాలు, ఈ ఏడాది జూన్ నాటికి ఒకేచోట మూడేళ్ల సర్వీస్ పూర్తయ్యే వారిని బదిలీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. అలాగే 600 మంది తహసీల్దార్లు బదిలీ కానున్నారు. దీనికి సంబంధించిన […]