రాహుల్ గాంధీ ఇంటికెళ్లాడు. గంటలపాటు సోది చెప్పాడు. శాలువా కప్పాడు. వీణ బహూకరించాడు. దేశం కోసం స్నేహమన్నాడు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జత కట్టాడు. ఆ నాయకులతో కలిసి ఊరూరా తిరిగి ప్రచారం చేశాడు. ఇప్పుడేమో రాహుల్ గాంధీ ఎవరో నాకు తెలియదు. నేనెప్పుడూ ఆయనకు సపోర్టు చేయలేదు అంటున్నాడు. ఆ వ్యక్తి ఎవరో ఈపాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది.
40 ఇయర్స్ ఇండస్ట్రి అయిన చంద్రబాబు నాయుడు మరోసారి నాలుగు మడత పెట్టేశాడు. ఇండియాటుడేకు చెందిన రాజ్‌దీప్ తాజాగా బాబును ఇంటర్వ్యూ చేశారు. ఈ సమయంలో 2018లో మీరు నరేంద్రమోదీకి బదులు రాహుల్ గాంధీకి సపోర్టు చేశారు కదా అని అడిగితే బాబు ఏ మాత్రం తడుము కోకుండా ‘నేను ఎప్పుడూ రాహుల్ గాంధీకి సపోర్టు చేయలేదు’ అని అబద్ధం చెప్పేశాడు. కొన్ని విషయాల్లో మోదీతో వ్యతిరేకించానని చెప్పుకొచ్చాడు.
2018లో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చాక కేంద్రంలో యూపీఏ వస్తుందని చంద్రబాబు కాంగ్రెస్‌కు జై కొట్టాడు. ఆలస్యం చేయకుండా రాహుల్ గాంధీని పలుమార్లు కలిశాడు. దేశం కోసమే స్నేహమంటూ ఎల్లో మీడియాలో కథలు రాయించుకున్నాడు. రాహుల్‌తో బాబు భేటీ అయ్యారని, ఢిల్లీలోని కీలక ఘట్టం ఆవిష్కృతమైందని, మోదీకి వ్యతిరేకంగా గళం విప్పారని ఈనాడు రాసి సంబరపడిపోయింది. బాబు అనేక సభల్లో రాహుల్‌తో వేదిక పంచుకున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు పొగుడుకున్నారు. తీరా 2019లో మళ్లీ ఎన్డీఏ అధికారంలోకి రావడంతో నారా వారు కాంగ్రెస్‌ను తన భుజాల నుంచి దించేసి బీజేపీ వెంట పడ్డాడు. ఇదంతా జగమెరిగిన సత్యం. కానీ ఆయన తాజా ఇంటర్వ్యూలో రాహుల్‌కు సపోర్టు చేయలేదని చెప్పి ఛీ ఏం మనిషబ్బా అని అందరూ అనుకునేలా చేశాడు.
2018 నుంచి 2019 ఎన్నికలయ్యే వరకు మోదీని, కమలం నేతల్ని బాబు బాగా తిట్టాడు. కానీ ఇంటర్వ్యూలో మాత్రం తాను కేవలం ప్రత్యేక హోదా విషయంలో మాత్రం విభేదించానని చెప్పుకొచ్చాడు. అయితే ఇదే బాబు ఆనాడు హోదా గురించి చెప్పకుండా అన్ని వ్యవస్థల్ని మోదీ ప్రభుత్వం నాశనం చేసేసిందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సి ఉందంటూ రాష్ట్రాలు తిరిగి ప్రచారం చేశాడు. 19 ఎన్నికల సమయంలో నారా వారు ప్రతి విషయంలో కమలం పెద్దలపై దుష్ప్రచారాలు చేశాడు. 24కు వచ్చేసరికి వారే కావాల్సి వచ్చారు. జర్నలిస్ట్ రాజ్‌దీప్ సైతం ఆశ్చర్యపోయేలా జవాబులిచ్చాడు టీడీపీ అధినేత. మోదీని ఉగ్రవాది అన్న నోటితోనే ఆయన వల్లే దేశం సూపర్ పవర్ అయ్యిందని పొగిడాడు.
మాటలు మార్చడలంలో చంద్రబాబు దిట్ట. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేస్తాడు. అప్పటి రాజకీయ పరిస్థితుల్ని బట్టి కలిశాం. నేటి పరిస్థితుల్లో ఎన్డీఏలో చేరామంటే పోయేదానికి నేనెప్పుడూ రాహుల్ గాంధీకి సపోర్టు చేయలేది చెప్పాడు. దీంతో పాత ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. రేపొకరోజు మళ్లీ కాంగ్రెస్‌తో కలిసి మోదీని తిట్టేస్తాడు. ఎన్డీఏకు నేనెప్పుడూ సపోర్టు చేయలేదని అనేస్తాడు. అదే బాబోరి స్పెషల్.