ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర భూముల రీ సర్వే పేరుతో 100 సంవత్సరాల తర్వాత దేశంలోనే తొలిసారిగా ఏపీలో భూముల రీ సర్వే జరిపిస్తుంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. గతేడాది ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం నమూనాగా తొలి దశలో భాగంగా గతేడాది 2వేల గ్రామాల్లో రీ సర్వే చేసిన కార్యక్రమం విజయవంతమైంది. తరువాత ఇప్పుడు రాష్ట్ర మొత్తం సమగ్ర సర్వే జరుగుతుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ సర్వే చేస్తున్నారు. అయితే ఇలా భూ సర్వే చేయడం ద్వారా లక్షల సంఖ్యలో భూ సమస్యలు పరిష్కారమవుతున్నాయి. భూ వివాదాలు, సరిహద్దు సమస్యలు, మ్యుటేషన్లు, సబ్ డివిజన్లు, నిషేధిత ఆస్తులు, వారసత్వ అంశాలు వంటి ఎన్నో చిక్కు ముడులను విప్పుతూ రీ సర్వే సమాధానం చూపుతోంది. వైఎస్సార్సీపీ తీసుకువచ్చిన ఈ విధానం దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా ఫాలో అయ్యేందుకు మొగ్గుచూపుతున్నాయి.
తాజాగా కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆంధ్రప్రదేశ్ లో భూ రికార్డుల నిర్వహణ బాగుందని, ఆ వ్యవస్థను అధ్యయనం చేస్తామని ప్రకటించారు. తెలంగాణ లో కూడా ఇలాంటి విధానాన్ని తీసుకువచ్చేందుకు ప్రతిపాదిస్తానని ఆయన తెలిపారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం విధివిధానాలు మిగతా రాష్ట్రాల వారికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.