ఏపీలో దివంగతనేత డాక్టర్ వైయస్సార్ గారు తెచ్చిన ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం అని ప్రకటిస్తూ వచ్చిన బీజేపీ ఇదే అంశంపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ లకి సైతం ఒక క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం అందుతుంది. కూటమి ఎన్నికల వ్యూహాలు, ముస్లిం రిజర్వేషన్ల అంశంపై చర్చించేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబుని కలిసిన బీజేపీ సీనియర్ నేతల బృందం చంద్రబాబుకి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చేసింది.
అయితే ముస్లిం రిజర్వేషన్లపై ఇరుపక్షాలు చర్చించినప్పుడు, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేయడం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందని ఎన్నికల్లో ప్రస్తావించకుండా ఎన్నికల తరువాత అమలు చేసే అవకాశంపై ఆలోచించమని చంద్రబాబు నాయుడు బీజేపీ పెద్దలకి సూచించినట్టు సమాచారం. అయితే బీజేపీ పెద్దలు మాత్రం చంద్రబాబు అభ్యర్ధనను సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తుంది. ముస్లిం రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని బీజేపీ నేతలు చంద్రబాబుకి స్పష్టం చేశారు. ఇది వారి జాతీయ స్థాయి విధానమని. ముస్లింలకు మత ఆధారిత రిజర్వేషన్లకు తాము ఒప్పుకునేది లేదని వారు చంద్రబాబుకి నొక్కి చెప్పినట్టు తెలుస్తుంది.
ముస్లిం రిజర్వేషన్ల రద్దు అంశం చంద్రబాబుకి ఎన్నికల ఫలితాల్లో వ్యతిరేకత వస్తుందని బాదే తప్ప చిత్తశుద్దిగా రిజర్వేషన్లు ఉండాలని బీజేపీ పెద్దల దగ్గర మాట్లాడలేకపోవడం అత్యంత భాదాకరమని, ఈ అంశం ముస్లిం సమాజానికి తెలిస్తే ఇక వారు తెలుగుదేశం పార్టీ మొహం కూడా చూసే పరిస్థితి ఉండదని చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుని ముస్లిం సమాజాన్ని పూర్తిగా ముంచేశారని తెలుగుదేశం నేతలే చెబుతున్న మాట .