సీఎం జగన్ పాలనపై కొత్త పాట విడుదల అయింది. ఇప్పటికే ‘జెండాలు జత కట్టడమే మీ అజెండా’ పాట విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా వీ లవ్ జగన్ అంటూ కొత్త పాట విడుదల అయింది. పాట రిలీజ్ అయిన కొంతసేపటికే వీ లవ్ జగన్ పాట ట్రెండింగ్ అవుతూ ఉండటం విశేషం..
వీ లవ్ జగన్ పాటలో సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమ పథకాలను, జరిగిన అభివృద్ధిని వివరించడమే కాకుండా ముఖ్యమంత్రి జగన్ మీద ప్రజలకున్న ప్రేమను కూడా వివరించడం గమనార్హం.
కాగా సీఎం జగన్ ఏపీలో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మేమంతా సిద్ధం పేరుతో సాగుతున్న బస్సు యాత్ర ద్వారా సీఎం జగన్ ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రజలు కూడా మేమంతా సిద్ధం బస్సు యాత్రలు బ్రహ్మరథం పడుతున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుండగా టీడీపీ , జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్నాయి..