2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోను తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో విడుదల చేశారు. 2024 అధికారంలోకి రాగానే విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తామని తన ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ప్రకటించారు. పెట్టుబడులను ఆకర్షించడానికి ఆంధ్ర రాష్ట్రంలో సరైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది విశాఖనే అని మరోసారి స్పష్టం చేశారు. ముందు నుంచి చెబుతున్నట్లుగా అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందని చెప్పారు. కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామన్నారు.
2024 మేనిఫెస్టో, 2019 మేనిఫెస్టోకి కొనసాగింపుగానే చెప్పవచ్చు. అమలు చేసేటివి మాత్రం చెప్తామని చెప్పింది కచ్చితంగా చేస్తామని స్పష్టం చేశారు. అలివిగాని హామీలకు తాము దూరమని మరోసారి వివరంగా చెప్పారు. ప్రస్తుతం ఇస్తున్న 3000 రూపాయల పెన్షన్ ని విడతల వారీగా 3500 చేస్తామని తెలిపారు. అమ్మ ఒడిని 15 వేల రూపాయలు నుంచి 17 వేల రూపాయలకు పెంచారు. రైతు భరోసాను ప్రస్తుతం 13,500 రూపాయలు ఇస్తున్న దాన్ని 2500 పెంచుతూ 16 వేల రూపాయలు చేశారు. ప్రస్తుతం ఇస్తున్న నవరత్నాల పథకాలన్నీ అలానే కొనసాగుతాయి అని వెల్లడించారు.